BigTV English

Kamal Hassan – Indian 2: ఏంటి బ్రో అంత మాటన్నావ్.. దర్శకుడు శంకర్ వ్యాఖ్యలపై కాజల్ ఫ్యాన్స్ నిరాశ..

Kamal Hassan – Indian 2: ఏంటి బ్రో అంత మాటన్నావ్.. దర్శకుడు శంకర్ వ్యాఖ్యలపై కాజల్ ఫ్యాన్స్ నిరాశ..

Director Shankar – Kajal Aggarwalwill Indian 2: క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘ఇండియన్ 2’ ఒకటి. విశ్వనటుడు కమల్ హీసన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ‘విక్రమ్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్.. ‘ఇండియన్ 2’తో మరింత కల్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడని ఆయన ఫ్యాన్స్ ఫుల్ కన్ఫిడెన్స్‌లో ఉన్నారు.


ఈ మూవీలో కమల్ హాసన్‌తో పాటు నటుడు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బావీ సింహా, ఎస్‌ జే సూర్య వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగారు. అయితే 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ వస్తోంది.

ఈ సీక్వెల్ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినా.. ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోలేదు. అందుకు కూడా ఓ కారణం ఉంది. ఎందుకంటే దర్శకుడు ఇండియన్ 2 మూవీ షూటింగ్ చేస్తుండగానే మరోవైపు రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్‌ను తెరకెక్కించే పనిలో పడ్డాడు. అందువల్లనే ఇండియన్ 2 చిత్రం పూర్తియ్యే సరికి ఇంత టైం పట్టింది.


Also Read: దర్శకుడు శంకర్ ప్లాన్ అదుర్స్.. ‘ఇండియన్ 2’ కోసం తరలి వస్తున్న సౌత్ స్టార్ హీరోలు?

ఇక ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల అంటే జూన్ 12న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఇండియన్ 2 మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి కమల్ హాసన్‌తో పాటు పలువురు నటీ నటులు పాల్గొన్నారు.

అయితే ఈ ఈవెంట్‌లో దర్శకుడు శంకర్.. నటి కాజల్‌ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఆమె ఫ్యాన్స్‌ను నిరాశపరిచాయి. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ 2 సినిమాలో కాజల్ అగర్వాల్ చేసిన పాత్రలు పెద్దగా ఉండవని.. ఇండియన్ 3లో ఆమె పాత్ర చేసిన సన్నివేశాలు ఉంటాయని అన్నారు. దీంతో కాజల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో పడిపోయారు.

ఎందుకంటే పెళ్ళి, పిల్లలు తర్వాత కాజల్ తొలిసారి కమల్ హాసన్‌తో నటిస్తుంది. అందువల్లనే ఇండియన్ 2 సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఇండియన్ 2లో కాజల్ పాత్ర సీన్లు లేవు అని తెలిసే సరికి ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏంటి బ్రో అంతపని చేశావ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×