BigTV English

Game Changer OTT : ఓటీటీలోకి గేమ్ ఛేంజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Game Changer OTT : ఓటీటీలోకి గేమ్ ఛేంజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Game Changer OTT : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఎంతో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా నెలరోజులు పూర్తవకుండానే ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోతుంది.


రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైపోతోంది. ఫిబ్రవరి 7న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రాబోతుంది. కాగా హిందీలో స్ట్రీమ్ కావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా ఈ సినిమా రిలీజయ్యింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. జీ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. థియేటర్ లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న గేమ్ ఛేంజర్.. కమర్షియల్ గాను అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఎన్నో విమర్శల మధ్య బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయింది.


ఇప్పుడు ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ భారీ మెుత్తంలో సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో నిర్మాతకు కాస్త ఊరట లభించినట్లు తెలుస్తుంది. ఇక భారీ బడ్జెట్ సినిమాలకు కనీసం 56 రోజుల టైమ్ ఫ్రేమ్ ఉండాలని ఇప్పటికే సినీ విశ్లేషకులు పలుమార్లు చెప్పినప్పటికీ ఈ సినిమా 28 రోజులకే ఓటీటీలో సందడి చేయటానికి సిద్ధమైపోతోంది.

ALSO READ : 300 న్యూ*డ్ వీడియోల కేసులో బిగ్ ట్విస్ట్… మస్తాన్ ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కుంటూ వచ్చింది. సినిమాపై విపరీతంగా నెగిటివ్ టాక్ క్రియేట్ చేయడం, ఆర్గనైజ్డ్ ట్రోలింగ్, రిలీజైన రోజే HD ప్రింట్ లీక్ అవ్వటం, సినిమా పైరసీ జరగటం, సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలు ట్విట్టర్లో కనిపించడం.. ఇలా ఎన్నో విషయాలు సినిమా విజయంపై ప్రభావం చూపించాయి. సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ అనూహ్య రీతిలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చింది.

గేమ్ ఛేంజర్ సినిమా విడుదలైన రోజు రూ.51 కోట్ల కలెక్షన్స్ తో బలంగా స్టార్ట్ అయింది. అయితే తర్వాత వారాల్లో మాత్రం అనూహ్యంగా వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. 23 రోజుల్లో దాదాపు రూ.130.74 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. 23వ రోజు రూ. 6 లక్షలు మాత్రమే వసూలు చేయడంతో కలెక్షన్స్ భారీగా దెబ్బతిన్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ తన క్యారెక్టర్స్ లో గుర్తుండిపోయేలా నటించాడు. అభిమానుల్ని మెప్పించి రెండు పాత్రలలో అలరించాడు. అప్పన్నగా, ఐఏఎస్ రామ్ నందన్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో రాంచరణ్ కనిపించిన తీరు అభిమానుల్ని మెస్మరైజ్ చేసింది. ఇందులో చరణ్ సరసన కీయరా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్ జే సూర్య, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. తమన్ సంగీతాన్ని అందించారు.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×