E-Paper
Advertisement

Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 

Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 
Advertisement

Ashwini Vaishnaw: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డైరెక్ట‌ర్ క్రిస్టాలినా జార్జివా సమక్షంలోనే భారత్ ఏఐ సామర్థ్యంపై గట్టి గళం వినిపించారు. భారత్‌ను ‘రెండో స్థాయి ఏఐ శక్తి’గా వర్గీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ, ప్రపంచ ఏఐ చిత్రపటంలో భారత్ అగ్రశ్రేణిలోనే ఉందని గణాంకాలతో వివరించారు.

ఈ సందర్బంగా అశ్విని వైష్ణవ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నివేదికను ప్రధానంగా ప్రస్తావించారు. “ఐఎంఎఫ్ ప్రమాణాలు ఏమిటో నాకు తెలియదు కానీ, స్టాన్‌ఫోర్డ్ వర్గీకరణ ప్రకారం ఏఐ వ్యాప్తి, సంసిద్ధతలో భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. ఇక ఏఐ ప్రతిభ (AI Talent) విషయంలో మన దేశం రెండవ స్థానంలో నిలిచింది. కాబట్టి రెండవ వర్గంలో మీ వర్గీకరణ సరైనదని నేను అనుకోను. భారత్ వాస్తవానికి మొదటి శ్రేణిలోనే ఉంది.” అని ఆయన స్పష్టం చేశారు. ఐఎంఎఫ్ అనుసరిస్తున్న ప్రమాణాలు పాతవి.. చాలా పరిమితమైనవి అయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

కేవలం ఏఐ మోడల్స్ అభివృద్ధి చేయడంపైనే కాకుండా, ఏఐ వ్యాప్తిని సామాన్యులకు చేరవేయడంపైనే తమ ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టిందని మంత్రి వెల్లడించారు. ఏఐ సామర్థ్యాన్ని కేవలం మోడల్స్ ద్వారా కాకుండా.. అప్లికేషన్లు, మోడల్స్, చిప్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎనర్జీ అనే ఐదు పొరల్లో (5 Layers) చూడాలని, భారత్ ఈ ఐదింటిలోనూ వేగంగా దూసుకుపోతోందని వివరించారు. భారత్ త్వరలోనే ప్రపంచానికి AI యూజ్ కేస్ క్యాపిటల్గా మారుతుందని, కేవలం పెద్ద మోడల్స్ నిర్మించడం కంటే సామాజిక సమస్యలకు పరిష్కారాలను చూపడమే కీలకమని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి ఏఐ నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, తద్వారా ప్రపంచానికి అవసరమైన ఏఐ అప్లికేషన్లను భారత్ నుండే అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Read Also:  దావోస్‌లో తెలంగాణ పెట్టుబడుల జాతర.. రూ. 7,000 కోట్లకు పైగా ఒప్పందాలు.. ఏఐ, క్లీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ!

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×