E-Paper
Advertisement

Davos WEF: దావోస్‌లో తెలంగాణ పెట్టుబడుల జాతర.. రూ. 7,000 కోట్లకు పైగా ఒప్పందాలు.. ఏఐ, క్లీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ!

Davos WEF: దావోస్‌లో తెలంగాణ పెట్టుబడుల జాతర.. రూ. 7,000 కోట్లకు పైగా ఒప్పందాలు.. ఏఐ, క్లీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ!
Advertisement

దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో తెలంగాణ ప్రభుత్వం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం వివిధ అంతర్జాతీయ సంస్థలతో జరిపిన చర్చలు సఫలమై, రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు ఖరారయ్యాయి.

హైదరాబాద్‌లో లోరియల్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్

ప్రపంచ ప్రసిద్ధ బ్యూటీ బ్రాండ్ ‘లోరియల్’ (L’Oreal) తన మొట్టమొదటి బ్యూటీ-టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లోరియల్ సీఈఓ నికోలస్ హియోరోనిమస్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ కేంద్రం ద్వారా ఏఐ, అనలిటిక్స్, సప్లై చైన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల్లో వినూత్న పరిష్కారాలను లోరియల్ ప్రపంచవ్యాప్త యూనిట్లకు అందించనుంది. ఇది హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మరింత పటిష్టం చేయనుంది.

బ్లైజ్ సంస్థతో ఏఐ అభివృద్ధికి ఒప్పందం

Advertisement

కాలిఫోర్నియాకు చెందిన ‘బ్లైజ్’ (Blaze) సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. తక్కువ శక్తిని వినియోగించే ఏఐ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో ఈ సంస్థ కీలకం. వచ్చే రెండు దశాబ్దాల్లో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంలో భాగంగా, ఏఐ డేటా సెంటర్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

క్లీన్ ఎనర్జీ.. రూ.6,000 కోట్ల విద్యుత్ ప్లాంట్

స్లోవాకియాకు చెందిన ‘న్యూక్లర్ ప్రొడక్ట్స్’ సంస్థ తెలంగాణలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (SMR) ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచింది. సుమారు రూ.6,000 కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్ ద్వారా క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో మైలురాయిని అధిగమించనుంది. 2047 నాటికి నెట్-జీరో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ సుస్థిర ఇంధన ప్రాజెక్ట్ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisement

అమెరికాకు చెందిన సర్గడ్ (Sargad) సంస్థ రాబోయే ఐదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో విమానాల నిర్వహణ, మరమ్మత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వరంగల్ లేదా ఆదిలాబాద్ విమానాశ్రయాల్లో ఈ కేంద్రాన్ని నెలకొల్పాలని సీఎం సూచించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ALSO READ: Davos-2026: ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిలో ఏఐ వర్సిటీపై చర్చ

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×