BigTV English

Ayodhya : 500 ఏళ్ల కల సాకారం అయ్యింది.. ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ప్రముఖులు..

Ayodhya : అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ట అనంతరం ప్రముఖులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ 500 ఏళ్ల కల నెరవేరిందన్నారు. ఎన్నో పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లు ఎదురుచూసిందన్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యమన్నారు.

ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో దేశం అంతా రామమయంగా మారిందని యోగి అన్నారు. ప్రధాని మోదీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇదంతా సాధ్యమైందని కొనియాడారు. అయోధ్యకు పూర్వ వైభవం తెచ్చేందుకు కేంద్రం రూ. వందల కోట్లు కేటాయించారన్నారు. సంకల్పం తీసుకున్న చోటే మందిరం నిర్మితమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని యోగి ప్రశంసించారు. అయోధ్య ఆలయ ప్రకృతిని ప్రతిబింబించే బహుమతులను ప్రధాని మోదీకి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు యోగి అందజేశారు.

శ్రీరాముడు ధర్మం, త్యాగనిరతికి ప్రతీక అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అన్నింటిని సమన్వయం చేసి ముందుకెళ్లడమే మన ధర్మమని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేదరికాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిందని ప్రశంసించారు.

లక్షలాది మంది త్యాగాల ఫలితమే ఆలయ ప్రారంభోత్సవమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శ్రీరాముడి ప్రాణప్రతిష్ట ప్రభావం యావత్తు ప్రపంచంపై ఉంటుందన్నారు. లక్షలాది మంది భక్తుల త్యాగాలు, నమ్మకం ఫలితమే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవమన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం మన జీవితంలో ఆనందకరమైనదన్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×