BigTV English

Balochistan – India: మద్దతు కోరిన బలూచిస్తాన్.. భారత్ నిర్ణయం ఏంటి..?

Balochistan – India: మద్దతు కోరిన బలూచిస్తాన్.. భారత్ నిర్ణయం ఏంటి..?

శత్రువుకి మిత్రుడు మనకి శత్రువు. ఈ నియమం ప్రకారం పాకిస్తాన్ కి సాయం చేసిన టర్కీ మనకి కూడా శత్రువుగా మారింది. ఇప్పుడు ఫలితం అనుభవిస్తోంది. ఇక శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు. పాకిస్తాన్ కి పక్కలో బల్లెంలా ఉన్న బలూచిస్తాన్ తాజాగా స్వతంత్రత ప్రకటించుకుంది. అంతర్జాతీయ వేదికపై భారత్ మద్దతు కోరుతోంది. మరిప్పుడు భారత్ నిర్ణయం ఏంటి..? బలూచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా భారత్ గుర్తిస్తుందా..? దాని వల్ల మన దేశానికి ఒరిగేదేంటి..? తరిగేదేంటి..?


బలూచ్ అభ్యర్థన..
బలూచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా ప్రకటిస్తున్నట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అంతే కాదు, కీలక పట్టణాలను బీఎల్ఏ స్వాధీనం చేసుకుని, పాక్ బలగాలను వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. అయితే అదంత ఈజీ కాదు. తమకు తాము స్వతంత్రులం అని ఒక అతివాద గ్రూప్ ప్రకటించుకుంటే ఆ ప్రాంతాన్ని దేశంగా గుర్తించడం సాధ్యం కాదు. ప్రపంచ దేశాల మద్దతు అవసరం, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి ఆ దేశాన్ని గుర్తించాలి. ఆ గుర్తింపు కోసమే ఇప్పుడు ఇండియా సాయం కోరుతోంది బలూచిస్తాన్. ఢిల్లీలో తమ దేశ దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసుకోడానికి అనుమతి కావాలని, అదే సమయంలో ఐక్యరాజ్యసమితికి రికమెండ్ చేయాలంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ నేతలు భారత్ ని రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్నారు. అయితే భారత్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన ఇప్పటి వరకు లేదు.

ఒప్పుకుంటే..?
బలూచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా భారత్ గుర్తిస్తే.. అది సంచలన నిర్ణయంగా మారుతుంది. బలూచిస్తాన్ కి సగం భారం తొలగినట్టవుతుంది. అంతర్జాతీయంగా కూడా బలూచిస్తాన్ కి ఇతర దేశాలు మద్దతిచ్చే అవకాశముంది. ఐక్యరాజ్య సమితి కూడా ఆ దేశ గుర్తింపు విషయంలో ఆలోచిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ తిక్క కుదిరినట్టవుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉన్న బలూచిస్తాన్ విడిపోతే, ఆ దేశం మరింత కష్టాల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ తో ఇబ్బంది పడిన పాక్, ఇప్పుడు బలూచిస్తాన్ తిరుగుబాటుతో సతమతం అవుతోంది. బలూచ్ నిర్ణయాన్ని భారత్ స్వాగతిస్తే వారి తిరుగుబాటుకి మనం కూడా బహిరంగ మద్దతు ప్రకటించినట్టవుతుంది. పాకిస్తాన్ మన నిర్ణయాన్ని అంతర్జాతీయ వేదికపై తప్పుబట్టే అవకాశం కూడా ఉంది. ఒకరకంగా భారత్ కూడా వేర్పాటువాదాన్ని ప్రోత్సహించినట్టవుతుంది. అంటే.. కాశ్మీర్ విషయంలో కూడా ఈ నిర్ణయం మనకు రివర్స్ అయ్యే అవకాశం ఉంది.


ఒప్పుకోకపోతే..?
బలూచిస్తాన్ అభ్యర్థనను భారత్ ఒప్పుకోకపోతే.. ఇతర ప్రపంచ దేశాలు కూడా బలూచ్ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటాయి. ఎవరి మద్దతు లేకపోతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలహీనపడే అవకాశముంది. ఒక దశ వరకు వారు పోరాటే చేయగలరు కానీ, పాకిస్తాన్ ఆర్మీని పూర్తి స్థాయిలో వారు నిలువరించలేరు కదా. ఇటు కాల్పుల విరమణ అమలులో ఉంది కాబట్టి, అటు బలూచ్ పై పాక్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి వారిని కట్టడి చేయగలదు.

భారత్ నిర్ణయం ఏంటి..?
ప్రస్తుతానికి భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా తమకు తాము స్వతంత్రులం అని ప్రకటించుకుంది. పాక్ ఆర్మీని తమ దేశం నుంచి వెళ్లిపోయేలా ఆదేశాలివ్వాలంటూ ఐక్యరాజ్య సమితిని వేడుకుంటోంది. డేరా బుగ్తి ప్రాంతంలో దాదాపు 100 గ్యాస్ బావుల్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. వాటిని అడ్డు పెట్టుకుని పాక్ ఆర్మీని హెచ్చరిస్తోంది. మరి పాకిస్తాన్ ఆర్మీ వెనక్కి తగ్గుతుందా, బలూచ్ వ్యవహారంపై భారత్ వైఖరి ఎప్పుడు బయటపెడుతుంది.. అనేది వేచి చూడాలి.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×