OTT Movie : ఓటిటిలో ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తుంటారు ప్రేక్షకులు. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఒక మంచి మెసేజ్ ను కూడా ఇస్తాయి. ఇటువంటి సినిమాలు మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ ఒక పేద మహిళ భర్తను పోగొట్టుకొని, పిల్లలతో జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టులా ఈదుతూ ఉంటుంది. మనసుకు హత్తుకునే ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వేలితే ..
స్టోరీలోకి వెళితే
శక్తి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తూ ఉంటుంది. ఆమె భర్త చనిపోవడంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారుతుంది. బతుకుదెరువు కోసం, ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది. ఆ పని చేసుకుంటూ కూడా పిల్లలకి రెండు పూటలా తిండి పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు, అదే వీధిలో ఉండే విన్సెంట్ అనే వ్యక్తి, ఆమె ఎప్పుడు లొంగుతుందా అని గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ ఉంటాడు. అతను డబ్బులు వడ్డీకి ఇచ్చి మహిళలని వేధిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒకరోజు శక్తి కొడుక్కి జ్వరం విపరీతంగా వస్తుంది. అందుకుగాను మరో దారి లేక విన్సెంట్ దగ్గర 3000 అప్పు తీసుకుంటుంది. ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలని ప్రయత్నిస్తుంది.
ఆయితే విన్సెంట్ మాత్రం ఆ డబ్బును తీసుకోకుండా, మనసులో పాడు బుద్ధి పెట్టుకుంటాడు. మరోవైపు పాచి పనులు చేసే ఇంటి ఓనర్, ఆమె డ్యూటీ కి సరిగ్గా రాలేదని జీతం కట్ చేసి ఇస్తుంది. తన కొడుక్కి బాగోలేదని చెప్పినా వినిపించుకోదు. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలని బాధపడుతూ ఉంటుంది. ఆ జీతం ఇంటి అద్దె, పిల్లల తిండికి కూడా సరిపోదు. చివరికి శక్తి తను చేసిన అప్పు తిరిగి ఇస్తుందా ? విన్సెంట్ కి లొంగిపోతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : దెయ్యాల కొంపలో దడుచుకునే ఫ్యామిలీ… చెల్లి కోసం ఆత్మగా మారి…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ తమిళ మూవీ పేరు ‘కనల్’ (Kanal). 2022లో విడుదలైన ఈ మూవీకి టి . సమయ మురళి దర్శకత్వం వహించారు. ఒంటరి ఆడది సమాజంలో ఎదుర్కునే పరిస్థితులతో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఒక వితంతువైన ఇద్దరు పిల్లల తల్లి చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.