BigTV English

Sailesh Kolanu: శైలేష్ కొల‌ను మాస్ట‌ర్ ప్లాన్ .. రంగంలోకి బాలీవుడ్ యాక్ట‌ర్‌

Sailesh Kolanu: శైలేష్ కొల‌ను మాస్ట‌ర్ ప్లాన్ .. రంగంలోకి బాలీవుడ్ యాక్ట‌ర్‌

Sailesh Kolanu:హిట్ యూనివర్స్‌లో హిట్‌, హిట్ 2 వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌తో వ‌రుస హిట్స్ సాధించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను. త‌దుప‌రి ఈయ‌న హిట్ యూనివ‌ర్స్‌లోనే హిట్ 3 సినిమాను తెర‌కెక్కిస్తాడేమోన‌ని అంద‌రూ భావించారు. కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. ఆయ‌న కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అదే ‘సైంధ‌వ్‌’. స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా ఈ సినిమా తెరకెక్క‌నుంది. శ్యామ్ సింగ‌రాయ్ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


సైంధ‌వ్ చిత్రాన్ని శైలేష్ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కించ‌బోతున్నారు. మొన్న రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌లో ఆ విష‌యాన్ని క్లియ‌ర్ క‌ట్‌గా చెప్పేశారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలీవుడ్‌కి చెందిన విల‌క్ష‌ణ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. శైలేష్ కొల‌నుతో ఆయ‌న క‌లిసి దిగిన ఫొటోను అందుకు రుజువుగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. న‌వాజుద్ధీన్ న‌టిస్తోన్న తొలి తెలుగు చిత్ర‌మిది. మ‌రి శైలేష్ ఆయ‌న‌తో ఎలాంటి పాత్ర చేయిస్తాడ‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోంది.

Link – https://twitter.com/KolanuSailesh/status/1618479804625616896?s=20&t=V5wFW2O0TePkuGb4nbsYyw


Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×