BigTV English

Bengaluru Mahalakshmi Murder: నిందితుడే బాధితుడా?.. బెంగుళూరు మర్డర్ నిందితుడి డైరీలో షాకింగ్ విషయాలు..

Bengaluru Mahalakshmi Murder: నిందితుడే బాధితుడా?.. బెంగుళూరు మర్డర్ నిందితుడి డైరీలో షాకింగ్ విషయాలు..

Bengaluru Mahalakshmi Murder| బెంగుళూరులో వారం రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన మహాలక్ష్మి మర్డర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మహాలక్ష్మి అనే యువతిని ఆమె ప్రియుడు ముక్తి రంజన్ రాయ్.. 50కు పైగా ముక్కులుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు. ఆ తరువాత ఒడిశాకు పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తుండగా.. ఒడిశాలో ముక్తి రంజన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో అతని డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో హత్యకు దారితీసిన పరిస్థితులను ముక్తి రంజన్ వివరిస్తూ రాశాడు.


పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ముక్తి రంజన్ రాయ్, మహాలక్ష్మి ఇద్దరూ.. బెంగళూరులోని ఒకే షాపింగ్ మాల్ లో కలిసి పనిచేసేవారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. అయితే ముక్తి రంజన్ పెళ్లి విషయం ప్రస్తావించినప్పుడల్లా మహాలక్ష్మి దాటవేసేది. ఇంతకుముందే మహాలక్ష్మికి మరో వ్యక్తితో వివాహం జరిగిందని విచారణలో తేలింది. ఆమె విడాకులు తీసుకొని కొంత కాలం తన తల్లిదండ్రులతో కలిసి జీవించింది. ఆ తరువాత ముక్తి రంజన్ తో ప్రేమలో పడి అతనితో సహజీవనం చేసేంది.

Also Read: నరబలి.. స్కూల్ సక్సెస్ కోసం 2వతరగతి పిల్లాడి హత్య!


సహజీవనం చేసే సమయంలో మహాలక్ష్మి తన నుంచి పెద్ద మొత్తంలో ధనం, బంగారం తీసుకుందని.. పెళ్లి చేసుకుందామంటే గొడవ చేసేదని తనను మానసికంగా హింసించేదని ముక్తి రంజన్ తన డైరీలో పేర్కొన్నాడు. డైరీలోని ఒక పేజీలో మహాలక్ష్మి తనను చంపేందకు కూడా ప్రయత్నించిందని రాశాడు.

ఆమె పెట్టే చిత్రహింసలు భరించలేక మహాలక్ష్మిని హత్య చేశానని.. అయితే తనకు హత్య చేసిన తరువాత మనశ్శాంతి లేదని తన తల్లితో చెప్పాడు. పోలీసులు తనను పట్టుకొని హంతకుడిగా ముద్ర వేస్తే భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని డైరీలో ముక్తి రంజన్ రాయ్ చివరగా రాశాడు.

Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..

మహాలక్ష్మి మర్డర్ కేసులో కర్ణాటక పోలీసులు.. నిందితుడు ముక్తి రంజన్ కోసం గాలిస్తుండగా.. అతను ఒడిశాలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిందితుడి ఉన్న ప్రదేశానికి చేరుకోగా.. అప్పటికే ముక్తి రంజన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×