E-Paper
Advertisement

ఫోన్‌లో రీల్స్ చూస్తోందని.. భార్యను చంపి, పరుపులో చుట్టి..

ఫోన్‌లో రీల్స్ చూస్తోందని.. భార్యను చంపి, పరుపులో చుట్టి..
Advertisement

Bengaluru Reels Murder: భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదాలు, సర్దుబాట్లు సహజం. కానీ, సోషల్ మీడియా వ్యామోహం, పట్టింపులు చివరకు ఒకరి ప్రాణాలనే తీసేంత దారుణానికి దారితీస్తున్నాయి. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ కిరాతక ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఉపాధి కోసం వచ్చి..

Advertisement

బిహార్‌కు చెందిన ధీరజ్‌ కుమార్‌ (24), రీమాకుమారి (20) పది నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుదెరువు కోసం బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు. రీమాకుమారి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం పొందగా, ధీరజ్ చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.

రీల్స్ గొడవ.. ప్రాణం తీసిన కోపం

Advertisement

రీమాకుమారి ఖాళీ సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చూడటానికి బాగా అలవాటు పడింది. రోజూ పని ముగించుకుని ఇంటికొచ్చాక కూడా ఆమె ఫోన్‌లోనే మునిగిపోతుండటం, సకాలంలో వంట చేయకపోవడం, ఇంటి పనులు పట్టించుకోకపోవడంతో ధీరజ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ విషయమై రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే గత నెల 27న ఆవేశంతో రగిలిపోయిన ధీరజ్, రీమా గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు.

దుర్వాసనతో వెలుగులోకి..

హత్య అనంతరం మృతదేహాన్ని పరుపులో చుట్టివేసి, ఇంటికి తాళం వేసి బిహార్‌కు పారిపోయాడు. జులై 29న రీమా విధులకు రాకపోవడం, ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితురాళ్లు ఇంటికి వెళ్లి చూశారు. లోపలి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది.

నిందితుడి అరెస్ట్

బెంగళూరు నైరుతి విభాగం డీసీపీ అనితా హద్దణ్ణనవర్‌ సమక్షంలో ప్రత్యేక పోలీస్ బృందం బిహార్‌ వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో ధీరజ్ తన నేరాన్ని అంగీకరిస్తూ.. ‘భార్య తీరు నచ్చలేదు, నిత్యం రీల్స్‌ చూస్తూ కాలం గడిపేస్తుండటంతో విసిగిపోయి చంపేశా’ అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

 Also Read: 51 లక్షల లడ్డూతో బిగ్ ప్లాన్.. రూ. 4 కోట్లతో జంప్! మై హోమ్ భుజాలో అసలేం జరిగింది?

Tags

Related News

స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. 9 మంది ప్రయాణికులు సజీవదహనం, గ్రేటర్ నొయిడాలో ఘటన

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×