Kavya Maran On Usman Tariq: పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ గా పేరుపొందిన ఉస్మాన్ తారిక్ కు (Usman Tariq) అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా పాపం అతనిది త్రో బౌలింగ్ (Usman Tariq Bowling action ) అని ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎదురైన అవమానాలే… ఫ్రాంచైజీ టోర్నమెంట్స్ లో కూడా ఉస్మాన్ తారిక్ ఫేస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్రీన్, టిమ్ డేవిడ్ ఇద్దరూ ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్ అని లైవ్ మ్యాచ్ లోనే పరువు తీయగా… తాజాగా కావ్య పాప (Kavya Maran) కూడా అదే వాదనతో వివాదానికి తెరలేపింది. అక్కడితో ఆగకుండా ఐసీసీ తో పాటు ది 100 లీగ్ 2026 టోర్నమెంటు (The Hundred Men’s Competition 2026) మేనేజ్మెంట్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ vs సన్‌రైజర్స్ లీడ్స్ (Birmingham Phoenix vs Sunrisers Leeds) జట్ల మధ్య 24 మ్యాచ్ నిన్న సాయంత్రం 6:30 గంటలకు జరిగింది. ఎడ్జ్ బస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ లీడ్స్ జట్టు 45 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు సంబంధించిన మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ దెబ్బకు సన్రైజర్స్ లీడ్స్ జట్టు కుదేలైంది. ఈ మ్యాచ్ లో ఉస్మాన్ తారిక్ వేసిన ఓ బంతికి సన్రైజర్స్ లీడ్స్ జట్టు ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) బిత్తర పోయాడు. అతడు వేసిన ఓ అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతేకాదు, ఈ మ్యాచ్ లో 20 బంతులు సంధించి, రెండు పడగొట్టాడు. 28 పరుగులు ఇచ్చాడు. మిచెల్ మార్ష్ తో పాటు, హ్యారీ బ్రూక్ వికెట్ కూడా పడగొట్టాడు ఉస్మాన్ తారిక్ (Usman Tariq).
Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భయ్యా…కోహ్లీని, నన్ను బండబూతులు తిట్టాడు
ఈ మ్యాచ్ లో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో వికెట్ కోల్పయిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ… కావ్య పాపకు మిచెల్ మార్ష్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లైవ్ మ్యాచ్ సందర్భంగా త్రో బౌలింగ్ అంటే తనను సోషల్ మీడియాలో ఆడుకుంటారన్న భయంతో.. కావ్య పాపకు ఫిర్యాదు చేశాడట మార్ష్. దీంతో రంగంలోకి దిగిన కావ్య పాప.. మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై ఐసీసీ తో పాటు ది 100 లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన యాజమాన్యంకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఉస్మాన్ ది త్రో బౌలింగ్ అని, గల్లీలో వేసినట్లుగా వేస్తున్నట్లు ఫైర్ అయ్యారట కావ్య. వెంటనే అతనిపై బ్యాన్ వేయాలని డిమాండ్ చేసిందని అంటున్నారు.
Mitchell Marsh was confused here, how to play Usman Tariq. 🥶pic.twitter.com/vtCbSpjI6N
— Qamar. (@Qamar5618) August 7, 2026