Bangalore News: అర గంట సేపు భారీ వర్షం పడితే చాలు.. నగరాలు చెరువులు మాదిరిగా కనిపిస్తాయి. కేవలం ముంబై, చెన్నైకి పరిమితం కాలేదు. బెంగుళూరు నగరానిది అదే పరిస్థితి. రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి బెంగుళూరు సిటీ తడిచి ముద్దైంది. దాహంతో అలమటించేవారికి రిలీఫ్. కాకపోతే సిటీలోకి కొన్ని ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే బెంగుళూరు.. వెనిస్ నగరాన్ని తరలించేలా బోట్లు రోడ్లపై దర్శనమిస్తున్నారు. భారీ వర్షాలకు ఒకరు మృతి చెందారు. మృతురాలు 35 ఏళ్ల శశికళగా గుర్తించారు. వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బోట్ల ద్వారా బాధతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వరధ ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు సీఎం సిద్ధరామయ్య రెడీ అవుతున్నారు.
బెంగళూరు నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం ఏకధాటిగా వర్షం ముంచెత్తింది. ఐదారు గంటలకుపైగా కురిసిన వర్షానికి నగరం నీట మునిగింది. వాహనాలకు బదులు రోడ్లపై బోట్లు దర్శనమిచ్చాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
ఈ మధ్యకాలంలో ఈ తరహా వర్షం పడలేదని అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అత్యధిక వర్షపాతమని చెబుతున్నారు నగర వాసులు. వర్షం బీభత్స దృశ్యాలు సోషల్ మీడియా హంగామా చేస్తున్నాయి. సిల్క్ బోర్డ్ జంక్షన్, హెచ్‌ఆర్‌బీఆర్ లేఅవుట్, బొమ్మన హళ్లి ప్రాంతాలు నీట మునిగాయి.
ALSO READ: శ్రీలంక శరణార్థులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మరో నాలుగు రోజులపాటు బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించడంతో నగరవాసులు హడలిపోతున్నారు. వర్షానికి తోడు భయంకరమైన గాలులు వీస్తున్నాయి. శుక్రవారం వరకు బెంగళూరుకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నగరం అంతా ఓ మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని సూచిస్తుంది.
సోమవారం భారీ వర్షం, ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశముందని తెలిపింది. వర్షం కారణంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో జల దిగ్బంధం చిక్కుకున్నాయి. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. బెంగళూరు నగర పోలీసులు ట్రాఫిక్ గురించి హెచ్చరిక జారీ చేశారు.
న్యూ బెల్ రోడ్, నాగవార, సారాయిపాల్య, అల్లాలసంద్ర నుండి యలహంక సర్కిల్ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఆదవారం కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం తెలిపింది. బెంగళూరు ఉత్తర ప్రాంతంలో 131.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో రాత్రి వేళ 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
🇮🇳🌨 India's Bengaluru Submerged as Flash Flooding Gives it Venice Vibes – #BangaloreRains #BengaluruRains pic.twitter.com/AVJaq7YD6J
— priya kumari (@KumariCr) May 19, 2025