Supreme Court: భారతదేశంలో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ.. శ్రీలంక శరణార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. శరణార్థులంతా వెంటనే దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని సుప్రీం తేల్చి చెప్పింది. ఇప్పటికే దేశంలో 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చింది. వీదేశీయులకు కూడా ఆశ్రయం ఇవ్వడానికి ఈ దేశం సత్రం కాదని.. వేరే ఏ దేశానికైనా వెళ్లండని సుప్రీంకోర్టు తెలిపింది.
భారతదేశం అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీయులను ఆదరించగల ధర్మశాల కాదని.. జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం వివరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద స్థిరపడే హక్కు భారతదేశ పౌరులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పింది.
Also Read: IOB Recruitment: డిగ్రీ పాసైతే చాలు.. ఐఓబీలో భారీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం