BigTV English
Advertisement

Gaza Nuclear Bomb | గాజా మీద అణు బాంబు వేస్తాం : ఇజ్రాయెల్

Gaza Nuclear Bomb | హమాస్ టెర్రరిస్టు గ్రూప్‌తో జరుగుతున్న యుద్ధంపై మంత్రి అమిచై ఎలియాహు ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడారు. గాజా పై యుద్ధానికి సంబంధించి అణు బాంబు వేసే ఆలోచన కూడా ఇజ్రాయెల్‌కు ఉందని చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

Gaza Nuclear Bomb | గాజా మీద అణు బాంబు వేస్తాం : ఇజ్రాయెల్

Gaza Nuclear Bomb | హమాస్ ఉగ్రవాదుల కోసం చేస్తున్న వేటలో ఇజ్రాయెల్ మానవతా విలువలను మరిచి రాక్షసంగా ప్రవర్తిస్తోంది. ఉగ్రవాదులపై ప్రతీకారం కోసం ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడిలో ఇప్పటివరకు దాదాపు 9,500 మంది అమాయక పాలస్తీనా వాసులు చనిపోయారు. ఇందులో కేవలం చిన్న పిల్లల సంఖ్య 4000 ఉండడం చూస్తే ప్రతి మనిషి హృదయం కలిచివేస్తుంది. యుద్ధం పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కూడా ఖండించింది. ఇజ్రాయెల్‌ను ఇప్పటికే ‘వార్ క్రిమినల్’అని ప్రకటించింది. వార్ క్రిమినల్ అంటే యుద్ధం పేరుతో నేరాలు చేయడం.


అయినా ఇజ్రాయెల్ ఎవ్వరినీ లెక్కచేయడం లేదు. గాజాలోని అమాయక పౌరుల కోసం భారతదేశం సహా చాలా దేశాలు ఆహారం, నీరు, మందులను సహాయం కోసం పంపిస్తుంటే వాటిని కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. ఇదంతా చూస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రదర్శిస్తున్నది నిజంగా ప్రతీకారమా? లేక ద్వేషమా? లేక మరింకేమైనా ఉద్దేశ్యం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచంలో చాలా చోట్ల కొంత మంది ఇజ్రాయెల్ వైపు నిలబడితే.. మరికొంత మంది పాలస్తీనా పరిస్థితిపై జాలిపడుతున్నారు. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ దేశ సాంస్కృత మంత్రి (Heritage Minister) అమిచై ఎలియాహు కొన్ని వివాదాస్పద, ద్వేష పూరితమైన, విచక్షణ లేని వ్యాఖ్యలు చేశారు.

హమాస్ టెర్రరిస్టు గ్రూప్‌తో జరుగుతున్న యుద్ధంపై మంత్రి అమిచై ఎలియాహు ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడారు. గాజా పై యుద్ధానికి సంబంధించి అణు బాంబు వేసే ఆలోచన కూడా ఇజ్రాయెల్‌కు ఉందని చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు.


అమాయక పౌరులకు మానవతా సహాయం కోసం యుద్ధ విరామాన్ని ప్రకటించాలని ఇజ్రాయెల్‌ను ఐక్యరాజ్య సమితి, కొన్ని దేశాలు కోరుతున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. “యుద్ధ విరామం ఉండదు. గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో సంబంధం లేని వారెవరూ లేరు” అని చెబుతూ.. అక్కడున్న వారంతా శత్రువులే అని పరోక్షంగా చెప్పాడు. గాజా పౌరులను నాజీలతో పోల్చాడు.

గాజా స్ట్రిప్‌ను మొత్తంగా ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంటే పాలస్తీనా పౌరులు ఎక్కడికి వెళతారు? అనే ప్రశ్న అడిగితే.. మంత్రిగారు సమాధానంగా వారి ఖర్మ అది వారి సమస్యకు పరిష్కారం కూడా వారే చూసుకోవాలి. ఏ ఎడారిలోనో.. లేదా ఐర్లాండ్‌లోకి వెళ్లిపోవాలి అని చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎలియాహు వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతలూ తీవ్రంగా విమర్శించారు.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆయన వ్యాఖ్యాలను తప్పుపట్టారు. “అణు బాంబు వేస్తాం అని చెప్పడం చాలా తప్పు, ఆయన వ్యాఖ్యలు వాస్తవ దూరం ఇజ్రాయెల్ లేదా ఐడీఎఫ్(ఇజ్రాయెల్ సైన్యం) అంతర్జాతీయ చట్టాలకు లోబడి, అమాయకులకు నష్టం చేయకుండా యుద్ధం చేస్తోంది” అని వివరించారు. ఆ వెంటనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి అమిచై ఎలియాహును సంస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం మూడు హాస్పిటల్లు, రెండు స్కూల్స్, ఒక ఆంబులెన్స్‌ని టార్గెట్ చేస్తూ బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో వేల మంది చనిపోయారు. ముఖ్యంగా అల్ అహ్లీ అనే క్రిస్టియన్ ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో ఏకంగా 500 మంది చనిపోయారు. వీరిలో డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది, చిన్నపిల్లలు ఉండడం గమనార్హం.

అంతర్జాతీయంగా జెనివా కన్వెషన్ చట్ట ప్రకారం ఏ యుద్ధంలో కూడా ఆస్పత్రులపై, అమాయక పౌరులపై దాడి చేయకూడదు. అలా చేస్తే యుద్ధ నేరం అవుతుంది. కానీ ఐక్య రాజ్య సమితిని వెనుక నుంచి అమెరికా నడిపిస్తోంది. అమెరికాకు ఇష్టం లేకపోయినా, ఇజ్రాయెల్ చేస్తోంది తప్పని తెలిసినా.. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌ పక్షాన నిలబడింది.దీంతో అమెరికాను ఢీకొనే సాహసం చేయలేక.. మిగతా ముస్లిం దేశాలు.. మౌనంగా యుద్ధాన్ని వీక్షిస్తున్నాయి.

Related News

Pak Bomb Blast: పాక్‌లో భారీ బ్లాస్ట్.. 12 మంది స్పాట్‌లో మృతి, 20 మందికి గాయాలు

Chicago Clashes: ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై నిరసనలు.. చికాగోలో చిన్నారిపై పెప్పర్ స్ప్రే కొట్టిన పోలీసులు

Philippines: ఫిలిప్పీన్స్‌ను వణికిస్తున్న ఫంగ్-వాంగ్‌ తుపాను.. స్పాట్‌లో 20 మంది

Earthquake In Japan: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Donald Trump: టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లంతా ‘మూర్ఖులు’.. అమెరికన్లకు 2 వేల డాలర్ల డివిడెండ్: డొనాల్డ్ ట్రంప్

Elon Musk: ఎలాన్ మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ.. ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు?

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Big Stories

×