Biker Chased and Mauled to death by Rhino: అతడు తన బైక్ పై తన దారిలో తాను వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఊహించిన ఘటన చోటు చేసుకుంది. వేల కిలలో బరువున్న ఓ భారీ జంతువు అతడికి సడెన్ గా తారాస పడింది. దీంతో తనకు ఏదో ప్రమాదం జరగబోతుందని గ్రహించాడు. వెంటనే అతను తన బైక్ ను ఆపి అక్కడి నుంచి పరిగెత్తాడు. అయినా కూడా అతను తన ప్రాణాలను కోల్పోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు కేకలు వేశారు. ఆ జంతువు పరుగులు పెడుతూ ఆ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నది. ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యింది. వాళ్లంతా వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అతడి తల పూర్తిగా నుజ్జునుజ్జయ్యి కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బాధితుడి ఆర్తనాదాలు, వ్యక్తుల అరుపులు వినిపిస్తున్నాయి. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Also Read: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. మహారాష్ట్ర “రాజ్యమాతగా” ఆవు
కమ్రూప్ జిల్లాకు చెందిన సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి ఆదివారం మోరిగాన్ లో ఉన్న పొబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం మీదుగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చాలామంది కూడా అతనితోపాటు వెళ్తున్నారు. కానీ, అనుకోకుండా ఓ భారీ ఖడ్గమృగం అతడికి సడెన్ గా తారాస పడింది. దీంతో అతను భయాందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే బైక్ ను అక్కడే ఆపి, పరిగెత్తసాగాడు. కానీ, గంటకు 55 కిలో మీటర్లకు పైగా పరిగెత్తే ఆ ఖడ్గమృగం అతడిని వెంటాడింది. అనంతరం అతడిపై దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ఇది గమనించిన పలువురు ఆ ఖడ్గమృగాన్ని తరిమి, అతడిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పెద్దగా శబ్ధాలు చేశారు. గుంపుగా వెళ్లి కేకలు వేస్తూ దానిని బెదిరించారు. కానీ, అప్పటికే అతడిపై ఆ ఖడ్గ మృగం దాడి చేసి చంపేసింది. ఆ జనాలను చూసి ఆ జంతువు అక్కడి నుంచి తిరిగి ఆ అభయారణ్యంలోకి పారిపోయింది. ఆ వెంటనే వారంతా కలిసి అతడి వద్దకు వెళ్లి చూశారు. కానీ, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అతడి తల పూర్తిగా నుజ్జునుజ్జయ్యి కనిపించింది. శరీరంపై గాయాలై రక్తం కారుతూ ఉండడంతో వారు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఆ తరువాత అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: జమ్మూ ర్యాలీలో ఖర్గేకు అస్వస్థత… మోదీని గద్దె దించేవరకు ప్రాణం పోదన్న కాంగ్రెస్ చీఫ్
అతడిపై దాడి చేసిన ఆ ఖడ్గమృగం సుమారుగా 2800 కిలోల బరువు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.