BigTV English

Madhoo Bala: సీనియర్ నటి మధుబాల కూతుళ్లను చూశారా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Madhoo Bala: సీనియర్ నటి మధుబాల కూతుళ్లను చూశారా.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే

Madhoo Bala:  రొమాంటిక్ సాంగ్స్  ప్రస్తావన వస్తే.. పరువం వానగా నేడు కురిసేనులే సాంగ్  టాప్ 5 లో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదే సాడ్ సాంగ్స్ ప్రస్తావన వస్తే నా చెలి రోజావే.. నాలో ఉన్నావే సాంగ్  లేకుండా ఆ లిస్ట్ ముగియదు. ఈ రెండు సాంగ్ లో నటించి మెప్పించిన బ్యూటీ  మధుబాల.  అందమే అతివై వస్తే ఆమెలే అని పాడుకొనేవాళ్లు అప్పట్లో కుర్రాళ్ళు.  అందమే అసూయా పడేలా ఉందే అని అనుకోని కుళ్ళుకోనేవాళ్ళు మిగతా హీరోయిన్స్. అప్పట్లో ఆమె అందం అలాంటింది.


రోజా సినిమాతో  కెరీర్ ను మొదలుపెట్టిన ఈ చిన్నది.. తెలుగులో అల్లరి ప్రియుడు,  ఆవేశం, గణష్, చిలక్కొట్టుడు లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని మధుబాల..  సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. ఇండస్ట్రీలో గ్లామర్ ఎంత ముఖ్యం అనేది   ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్లామర్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. కానీ, మధుబాల మాత్రం గ్లామర్  ఉన్నంత కాలం ఇంట్లో ఉండి.. గ్లామర్  తగ్గాకా రీఎంట్రీ ఇచ్చింది.

అప్పుడు ఉన్నంత అందం ఇప్పుడు మధుబాలలో లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  ముఖంలో వయసు మీదపడిన ఛాయలు ఆమెకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మధుబాల.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కీలక పాత్రలో నటిస్తూ మెప్పించింది. ఇక ఇప్పుడు మధుబాల గురించి ఎందుకు చర్చ అనుకుంటున్నారా.. ? మధుబాల గురించి కాదండీ బాబు.. ఆమె కూతుళ్ళ గురించి. మధుబాలకు అందమైన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


అందంలో  తల్లిని మించి ఒకరికి ఒకరు పోటీ పడుతూ  ఉంటారు. అసలు హీరోయిన్స్ కూడా వారికి సరిపోరు అన్నట్లు ఉంటారు. ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఆ ముద్దగుమ్మల గురించే. మధుబాల  పెద్ద కూతురు కెయా షా. అందానికే అందం ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె కప్ కేక్ బిజినెస్ చేస్తోంది. ఇక  రెండో కూతురు అమేయా షా.  అందంలో అక్కను,అమ్మను మించిపోయింది. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుంది. వీరిద్దరూ.. మధుబాల అందాన్ని పుణికిపుచ్చుకున్నారనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి రాలేదు కానీ.. ఈ అక్కాచెల్లెళ్ల అందం ముందు  హీరోయిన్స్ కూడా దిగదుడుపే అని చెప్పాలి. ప్రస్తుతం తమ తమ కెరీర్లలో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మలు ముందు ముందు ఇండస్ట్రీలోకి అడుగుపెడతారేమో చూడాలి.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×