BigTV English

Ratan Tata Request: నెటిజన్లకు రతన్ టాటా రిక్వెస్ట్.. “ప్లీజ్ దానిని కాపాడండి”..!

Ratan Tata Request: నెటిజన్లకు రతన్ టాటా రిక్వెస్ట్.. “ప్లీజ్ దానిని కాపాడండి”..!

Ratan Tata Urgent Request to Netizens: రతన్ టాటా. పరిచయం అక్కర్లేని వారిలో ఈయన ఒకరు. ప్రపంచ బిలీనియర్లలోనే కాదు.. ఎంతో మందికి సహాయం చేయడంలోనూ ముందుంటారాయన. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ఆదుకుంటారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు ముంబై వాసులను సహాయం చేయండని అడుగుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఓ వీధిశునకం ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయండని రిక్వెస్ట్ చేశారు.


ఇప్పుడున్న సమాజంలో.. నోరున్న మనుషులకంటే నోరులేని మూగజీవాలే మేలు అన్న భావన కలుగుతుంది. అలాగే రతన్ టాటాకు కూడా మూగజీవాలంటే ఎనలేని ప్రేమ. వాటికోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని కూడా నిర్మించారాయన. ఓ 7 నెలల వయసున్న వీధిశునకం అనారోగ్యం బాధపడుతోంది. దానికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. కానీ.. అది రక్తహీనతతో పాటు మరికొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు టెస్టుల్లో తేలింది.

దీంతో ఆ శునకాన్ని కాపాడేందుకు సహాయం చేయాలని ఇన్ స్టా వేదికగా అభ్యరించారు రతన్ టాటా. ఆ మూగజీవాన్ని కాపాడేందుకు తమ ఆస్పత్రిలో సిబ్బంది ఎంతో ప్రయత్నిస్తున్నారని, కానీ దాని చికిత్సకు బ్లడ్ కావాలని తెలిపారు. మీ వద్ద పూర్తి ఆరోగ్యంగా ఉన్న శునకం ఉంటే.. దాని రక్తాన్ని ఈ శునకం కోసం దానం చేయాలని కోరారు. ఈ సహాయం చేస్తారని ఆశిస్తున్నా అని వీడియోలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా చెప్పారు.


Also Read : వైరల్ అవుతున్న కుక్క వీడియో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

అయితే బిలీనియర్ అయిన రతన్ టాటా.. ఆయనకు ఎన్నిపనులున్నా పక్కనపెట్టి మరీ.. ఒక వీధి శునకం కోసం ఇలా నెటిజన్లను అభ్యర్థించేందుకు సమయం కేటాయించడం, ఆ ఆలోచన రావడం చాలా గొప్పవిషయమని కొనియాడుతున్నారు నెటిజన్లు. మీ మంచి మనసుకు ఇదే మా సెల్యూట్ సార్ అని కామెంట్లు పెడుతున్నారు. రతన్ టాటా రిక్వెస్ట్ స్పందించిన నెటిజన్లలో ఒకరు.. ఆ శునకానికి సహాయం చేశారు. మీ సహాయానికి ధన్యవాదాలు అని తెలిపారు. కాగా.. ఇన్ స్టా గ్రామ్ లో రతన్ టాటాకు 9.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Tags

Related News

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Big Stories

×