BigTV English

Aishwaraya Weds Umapathy: వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అర్జున్ షార్జా కూతురు ఐశ్వర్య.. పూల దండ వేస్తుండగా వరుడు ఏం చేశాడంటే..?

Aishwaraya Weds Umapathy: వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అర్జున్ షార్జా కూతురు ఐశ్వర్య.. పూల దండ వేస్తుండగా వరుడు ఏం చేశాడంటే..?

Actor Arjun Sharja’s Daughter Aishwaraya – Umapathy Wedding: ప్రముఖ నటుడు అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య – ఉమాపతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళనాడులోని చెన్నైలో ఉన్న అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి ఆలయంలో ఈ వివాహ వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖులతోపాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


అయితే, జూన్ 7న హల్ది కార్యక్రమంతో పెళ్లి వేడుక ప్రారంభమైంది. ఆ మరునాడు సంగీత్ కార్యక్రమం జరిగింది. జూన్ 10న ఉదయం సుముహూర్త సమయంలో పెళ్లి వేడుక జరిగింది. అనతరం కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రముఖులు ఈ నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కాగా, వెడ్డింగ్ రిసెప్షన్ ను జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. వీరి నిశ్చితార్థం కూడా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 27, 2023న ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Also Read: అప్పుడు విద్యార్థినికి డైమండ్‌ నెక్లెస్‌ను కానుకగా ఇచ్చాడు.. ఇప్పుడు మళ్లీ..

పెళ్లి ఫొటోలను పెళ్లికూతురు ఐశ్వర్య అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి. వరుడు ఉమాపతి, పెళ్లి కూతురు ఐశ్వర్య మెడలో మూడుముళ్లు వేస్తున్న దృశ్యం.. వధూవరులు పూల దండలు మార్చుకుంటున్న సన్నివేశం.. పెళ్లి సమయంలో వారిద్దరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కనిపించారు. అదేవిధంగా పెళ్లికి ముందు, కుటుంబంతో ఉన్న ఫొటోలను నటి షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి.

కాగా, ఓ రియాల్టీ షోలో నటుడు అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇదే షోలో ఉమాపతి పాల్గొన్నారు. ఆ సమయంలో వీరి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. కుటుంబాలు పరిచయమైన ఈ క్రమంలోనే ఉమాపతి, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×