Rajasingh BJP MLA : కాశ్మీర్‌లో మంగళవారం నాడు జరిగిన ఉగ్రదాడిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఖండించారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 తీసేసాక ప్రశాంతంగా ఉందని, అలాగే కాశ్మీర్‌ను కేంద్రం డెవలప్ చేసిందని అన్నారు. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చి కాశ్మీర్‌ను ప్రశాంతంగా ఉంచకుండా కుట్ర చేశారని ఆరోపణ చేశారు. ఎవ్వరిని కాకుండా టూరిస్టుల పై మాత్రమే దాడి చేయడం దారుణం అని అయన వాపోయారు. చంపిన వారు మరి అతి కిరాతకంగా పేరు అడిగి మరీ హిందువులను చంపేశారు..
ఈ ఘటన పై మోడీ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతుందని రాజాసింగ్ తెలిపారు. దాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకుని చంపేవరకు ఎట్టిపరిస్థితుల్లో మోదీ, అమిత్ షా వదలి పెట్టరని చెబుతున్నారు. ఈ ఘటనలో కొందరు కాశ్మీర్ స్థానికులు ఉగ్రవాదులకు సపోర్టుల చేశారని అయన తెలిపారు. హిందువులు అందరూ ప్రస్తుతం జరుగుతున్న అమర్ నాథ్, విష్ణు దేవి యాత్రకు అందరూ వెళ్లండి కానీ స్థానికంగా ఏం కొనకండి అని రాజాసింగ్ వెల్లడించారు.
అసలు జరిగిన కథ:
జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం చోటుచేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతిచెందగా, మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
అయితే మృతుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇంటలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ కూడా ఉన్నారు. ఆయన భార్య ఈ దాడి నుంచి క్షేమంగా బయటపడగా.. వారి పిల్లలను మాత్రం కాపాడుకోలేక పోయింది. అయితే అనేక రాష్ట్రాల వారితో పాటు ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని తెలిపారు. కావానికి చెందిన మధుసుదన్ చంపేశారు. అలాగే విశాఖ చెందిన చంద్రమౌళి కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ టీఆర్ఎస్ ప్రకటించింది.. అక్కడ ఉన్నవారిలో ప్రత్యేకించి తెలుగువారినే మాత్రమే టార్గెట్ చేసీ హత్య చేశారని అక్కడే ఉన్న పల్లవి చెప్పారు. ఆ తరువాత పల్లవి ప్రభుత్వ అధికారులను తన భర్త మృతదేహం కర్ఱాటకకు త్వరగా తీసుకు వచ్చేందుకు సాయం చేయాలని కోరింది. ఈ ఉగ్రవాదులకి తగిన శిక్ష విధించాలని చినపోయిన వారి కుటుంబాలు ఆరోపణలు చేశారు.
విడిచిపెట్టం: ప్రధానిమోదీ
జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ.. దాడి చేసిన వారిని విడిచి పెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తాం.. ఉగ్రవాదంపై పోరాడాలన్న మా సంకల్పం దృఢమైంది.. ఈ చర్య వెనుక ఉన్నవారిని న్యాయస్థానం ముందు నిలబెడతాం అంటూ తెలిపారు.