Owaisi on Terror Attack: పెహల్గామ్ ఉగ్రదాడి.. యావత్ దేశాన్ని దిగ్రాంతికి గురి చేసింది. టెర్రరిస్టులు సృష్టించిన బీభత్సాన్ని తెలుసుకొని షాక్ గురైంది. గతంలో ఎన్నో టెర్రరిస్టుల దాడులు జరిగాయి.! హోటల్‌లో, బస్టాప్‌లో, పార్కుల్లో.. బాంబులు పెట్టి నరమేథానికి పాల్పడిన ఘటనలు ఎన్నో. ముంబై పేలుళ్ల నుంచి దిల్‌సుఖ్‌నగర్ ట్విన్ బ్లాస్ట్ వరకు..టెర్రరిస్టులు రక్త దాహానికి వందలాది మంది అమాయకులు బలయ్యారు. మానవబాంబులుగా మారి సైనికులను పొట్టనపెట్టుకున్నారు. ఐతే గతంలో జరిగిన ఉగ్రదాడులతో పోల్చితే, నిన్నటి పహల్గామ్ టెర్రర్ అటాక్ పూర్తిగా డిఫరెంట్. ఈ తరహా ఉగ్రదాడి జరగడం దేశ చరిత్రలో ఇది తొలిసారి.
సాధారణంగా ఉగ్రదాడుల టార్గెట్ ఒక్కటే. సాధ్యమైనంత ఎక్కువగా ప్రాణనష్టం చేయడం. పిల్లలు, మహిళలని చూడరు. టార్గెట్ చేశామా, టాస్క్ ఫినిష్ చేశామా అన్నట్లే ఉంటారు. కానీ పహల్గామ్ ఉగ్రదాడిలో మాత్రం అలా చేయలేదు. తుపాకీలు పట్టుకొని.. దొరికినవారిని దొరికినట్టు చంపలేదు. పక్కా ప్లానింగ్‌తో, సెలెక్టెడ్‌గా, ఒక సెక్షన్‌ను టార్గెట్ చేసి ప్రాణాలు తీశారు. పేర్లు అడిగి, ఐడీకార్లు చూసి, మతమేంటో తెలుసుకొని, చివరికి అజా చెప్పించి మరీ దారుణానికి పాల్పడ్డారు. హిందువులు, అందులో మగవారిని మాత్రమే చంపేశారు. తమను కూడా చంపాలని అడిగిన మహిళలను కాల్చకుండా వదిలేశారు. దీన్ని బట్టి ఉగ్రవాదుల మోటివ్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది.
ఉగ్రవాదులు చాలా రోజులుగా రెక్కీ నిర్వహించి అదను చూసి దాడికి పాల్పడ్డారు. బైసరన్‌ను టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్. దట్టమైన అటవీ ప్రాంతం కావడం. సెక్యూరిటీ ఫోర్స్ తక్కువగా ఉండటం. పైగా ఆ ప్రాంతానికి చేరుకోవడం అంత ఈజీ కాదు. కాలినడకన లేదంటే గుర్రాలపై మాత్రమే వెళ్లాలి. అందుకే ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నాయి బలగాలు.
ఈ నేపథ్యంలో కాశ్మీర్‌లో ఉగ్రదాడిని MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందన్నారు. ఇది పుల్వామా కంటే పెద్ద ఘటన అని, దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టి.. భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. దాడిలో విదేశీయులు సైతం మరణించడం చాలా బాధాకరం అని తెలిపారు. మతం తెలుసుకుని మరీ చంపేశారు.. ఈ ఘటనపై మోదీ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.
Also Read: జమ్మూ కశ్మీర్ ఉగ్రదాడిలో.. ముగ్గురు తెలుగు వాళ్లు మృతి
ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించాయి బలగాలు. లష్కరే తొయిబా డిప్యూటీ కమాండర్ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే జాయింట్ ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. పహల్గామ్‌ను అష్టదిగ్భందం చేశారు. ధృవ్ చాపర్‌ను కూడా రంగంలోకి దింపారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో సెర్చ్ చేస్తున్నారు. దాడి సమయంలో ఉగ్రవాదులు బాడీ కెమరాలు ధరించినట్లు నిర్ధారించారు.
ఇటు LOC వెంబడి సెక్యూరిటీ టైట్ చేశారు. యూరి సెక్టార్‌లో భారత్‌లో చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు. వారి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
పహెల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ప్రత్యేక విమానంలో మృతదేహాలను శ్రీనగర్ కంట్రోల్ రూంకి తరలించారు.ఇవాళ ఉదయం సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడిన క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.