E-Paper
Advertisement

అన్నింటికీ ముందుగానే సిద్ధంగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు రిస్క్ అసలు తీసుకోరు

అన్నింటికీ ముందుగానే సిద్ధంగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు రిస్క్ అసలు తీసుకోరు
Advertisement

Numerology Plan B| జీవితంలో ఎప్పుడు ఏ పరిస్థితి ఎదురవుతుందో ముందుగా చెప్పడం కష్టం. అందుకే కొందరు ప్రతి పనికి ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేసుకుంటారు. అనుకోని సమస్య వచ్చినా తమ ప్రణాళిక ఆగిపోకుండా చూసుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం.. ఈ స్వభావాన్ని కొన్ని ప్రత్యేక మూల అంకాలతో అనుసంధానిస్తారు. ముఖ్యంగా మూడు మూల అంకాల వారు ముందుచూపుతో వ్యవహరిస్తారని న్యూమరాలజీ చెబుతుంది.

మూల అంకం 4.. ప్రతి పనికి ముందే ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తారు

న్యూమరాలజీలో మూల అంకం 4ను ప్రణాళిక, వ్యూహం, క్రమబద్ధతతో అనుసంధానిస్తారు. ఈ మూల అం ఉన్నవారు ఏ పని ప్రారంభించే ముందు వివిధ అవకాశాలను పరిశీలిస్తారు. మొదటి ప్రణాళిక విఫలమైతే ఏం చేయాలో కూడా ముందుగానే ఆలోచిస్తారు. అందుకే చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలను వీరు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని చూస్తారు.

మూల అంకం 7.. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచిస్తారు

Advertisement

మూల అంకం 7ను న్యూమరాలజీలో ఆలోచన, పరిశీలన, విశ్లేషణతో కలిపి చూస్తారు. ఈ మూలాంకం ఉన్నవారు ఏ పరిస్థితినైనా పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటారని నమ్మకం. ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని వల్ల వచ్చే పరిణామాలను ఆలోచిస్తారు. భవిష్యత్తులో పరిస్థితులు మారితే ఏ మార్గాన్ని ఎంచుకోవాలో కూడా పరిశీలిస్తారట.
అందుకే వీరి వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండటం సాధారణంగా కనిపించవచ్చని న్యూమరాలజీ వివరణలు చెబుతున్నాయి.

మూల అంకం 8.. భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు

న్యూమరాలజీలో మూల అంకం 8ను క్రమశిక్షణ, సహనం, బాధ్యతతో అనుసంధానిస్తారు. ఈ మూలాంకం ఉన్నవారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఉద్యోగం, డబ్బు, వ్యక్తిగత లక్ష్యాలు వంటి విషయాల్లో ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. ఏదైనా అడ్డంకి ఎదురైతే ఉపయోగపడే మరో మార్గాన్ని సిద్ధంగా ఉంచుకోవడం వారికి సౌకర్యంగా అనిపిస్తుంది.

ఈ మూల అంకాల వారు ప్లాన్ B ఎందుకు సిద్ధం చేసుకుంటారట?

Advertisement

ఈ మూడు మూల అంకాలకు సంబంధించిన సాధారణ న్యూమరాలజీ వివరణల్లో ముందుచూపు ముఖ్యమైన లక్షణంగా కనిపిస్తుంది. అకస్మాత్తుగా పరిస్థితులు మారితే తమ ప్లానింగ్ దెబ్బతినకూడదని భావిస్తారు. ప్రత్యామ్నాయ మార్గం ముందే ఆలోచించడం వారికి మానసికంగా సిద్ధంగా ఉండేందుకు సహాయపడుతుందని నమ్ముతారు. అయితే ప్రతి వ్యక్తి ఒకే విధంగా ప్రవర్తిస్తారని దీని అర్థం కాదు.

Also Read: నెలకు రూ.1 లక్ష సాలరీ.. సాఫ్ట్‌వేర్ జాబ్ కాదని చిన్న బిజినెస్.. నేడు రూ.9 కోట్ల టర్నోవర్

ప్లాన్ B ఉండటం ఎప్పుడూ భయానికి సంకేతం కాదు

బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం అంటే వైఫల్యాన్ని ఊహించడం మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో అది ముందుచూపు, జాగ్రత్త, పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అయితే వ్యక్తి స్వభావాన్ని కేవలం మూల అంకంలో నిర్ణయించలేం. వ్యక్తిగత అనుభవాలు, కుటుంబ పరిస్థితులు, పెరిగిన వాతావరణం, జీవిత అనుభవాలు కూడా నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి.

గమనిక: పై సమాచారం న్యూమరాలజీ సాంస్కృతిక, ఆధ్యాత్మిక విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడింది. వీటికి శాస్త్రీయంగా నిరూపితమైన ఆధారాలు లేవు.

Also Read: లవ్ ఫార్ములా.. గణితంతో ప్రేమను అర్థం చేసుకోవచ్చు.. ఆసక్తికర పరిశోధన

Related News

గుండె ఆరోగ్యం కోసం ఎంతసేపు వ్యాయామం చేయాలి? సరైన విధానం ఇదే

అగరబత్తి, దోమల కాయిల్ వల్ల క్యాన్సర్ వస్తుందా? డాక్టర్ ఏం చెప్పారంటే

మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ముందులాగ ప్రేమించడం లేదా? నిశ్శబ్దంగా ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి

సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

స్టైలిష్ లుక్,సూపర్ ఫీచర్లు..బెస్ట్ స్మార్ట్‌వాచ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్!

మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్నారా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

మలవిసర్జన సమయంలో రక్తం వస్తోందా? అది పైల్స్ అనకుంటే మీరు పొరబడునడినట్లే

Big Stories

Advertisement
×