Bride: ఈ మధ్యకాలంలో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. వివాహం తర్వాత అమ్మాయిలు అత్తింటి నుంచి వెళ్లిపోతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తొలుత యూపీలో దీనికి బీజం పడింది. అక్కడి నుంచి ఆ తరహా ఘటనలు రిపీట్ అవుతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో అలాంటి ఘటన బయటపడింది. పెళ్లైన నాలుగు రోజులకే వధువు అత్తింటి నుంచి వెళ్లిపోయింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా భరారి ప్రాంతం అది. పెళ్లయిన నాలుగు రోజులకే నూతన వధువు అత్తింటి ఇంటి నుండి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వధువు ఒక్కరే వెళ్లలేదు, ఆమెతోపాటు రూ. 18 లక్షల విలువైన నగలు, కొంత డబ్బు తీసుకెళ్లింది. ఈ ఘటనతో వరుడు కుటుంబసభ్యులు షాకయ్యారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.
బాధితుల ఫిర్యాదు మేరకు యమునా నగర్‌కు చెందిన 22 యువతిని అక్టోబరు 31న హర్యానాకు చెందిన సివిల్ కోర్టులో వరుడు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అత్తవారింటికి వచ్చారు. తాము ఇంట్లోకి ఆహ్వానించిన ఆ మహిళ ఈ తరహా నేరానికి పాల్పడుతుందని తాము ఎంత మాత్రం ఊహించలేదని చెప్పింది.
నవంబర్ 4న ఆ మహిళ సుమారు రూ. 16 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ. 1.80 లక్షల నగదుతో పారిపోయిందని ప్రస్తావించారు. ప్రస్తుతం వరుడు కుటుంబసభ్యులు షాక్‌లో ఉన్నారు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, విస్తృతంగా గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై బిలాస్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మాట్లాడారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న యువతి కోసం గాలింపు చేస్తున్నట్లు తెలిపారు.
యువతి ఎవరు? వరుడు వివాహం చేసుకోవడానికి దారి తీసిన కారణాలేంటి? వధువు ఏ ప్రాంతానికి చెందినది? ఆమెకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? వివాహానికి ముందు ఆ యువతి ఎవర్నైనా ప్రేమించిందా? లేకుంటే ఆమె కిలాడీ లేడీనా? కాకుంటే నగలు, నగదు ఎందుకు తీసుకెళ్తుంది? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. వరుడు నుంచి అసలు విషయాలు బయటకు వస్తే ఈ కేసు చేధించడం పోలీసులకు మరింత తేలిక కానుంది.