Ambati Rayudu Reaction On SRH Trading: 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం (IPL 2027) దగ్గర పడుతున్న నేపథ్యంలో 10 జట్ల మధ్య ట్రేడ్ డీలింగ్ చాలా ఆసక్తికరంగా మారింది. తమకు వద్దనుకున్న ప్లేయర్లను ట్రేడ్ ద్వారా జట్లు మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాపపై మాజీ ఆటగాడు అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఈసారి ట్రేడింగ్ ప్రక్రియలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకు వెళ్తోందని వ్యాఖ్యానించారు. వాళ్లు సరైన ఆటగాళ్లను ఎంచుకుంటూ.. చెత్త మొత్తం క్లియర్ చేస్తున్నారని మెచ్చుకున్నాడు. ఇందులో కావ్య పాపకు వందకు 200 మార్కులు వేయవచ్చని వ్యాఖ్యానించాడు. ఇదే దూకుడు టోర్నమెంట్ లోను ప్లేయర్లు ఇస్తే కచ్చితంగా హైదరాబాద్ ఛాంపియన్ కావడం గ్యారెంటీ అన్నాడు. దీంతో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐపీఎల్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో ట్రేడ్ ప్రక్రియ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి టీ.నటరాజన్ ను హైదరాబాద్ తీసుకుంది. అతని స్థానంలో జీషన్ అన్సారీని వదిలేసింది కావ్య. అలాగే ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లీస్ లాంటి డేంజర్ బౌలర్ల కోసం రూ.13 కోట్ల లియామ్ లివింగ్ స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ ను కాదనుకుంది. అయితే ఈ డీలింగ్ పై అంబటి రాయుడు రియాక్ట్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప ఈ సారి మంచి నిర్ణయాలు తీసుకొని ముగ్గురు ప్లేయర్లను సొంతం చేస్తుందని మెచ్చుకున్నాడు. రూ. 13 కోట్ల లియామ్ లివింగ్ స్టోన్ ను వదిలించుకొని సగం భారం తగ్గించుకుందని కావ్య పాపపై ప్రశంసల వర్షం కురిపించాడు.
వాడు ఇంత వరకు ఏ సీజన్ లోనూ సరిగ్గా ఆడలేదని… అలాంటోడిని వదిలేయడం కరెక్ట్ అని తెలిపాడు. జాక్ ఎడ్వర్డ్స్ ప్రభావం కూడా తక్కువేనని అతని రిలీజ్ కూడా తనకు నచ్చిందన్నాడు. జీషన్ అన్సారీ కూడా పెద్దగా రాణించిన సంఘటనలు లేవన్నాడు. ఈ ముగ్గురు క్రికెటర్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును (SRH) గెలిపించిన సందర్భాలు తనకు కనిపించడం లేదని.. అలాంటి వారి కంటే అద్భుతమైన ముగ్గురు ఆటగాళ్లను కావ్య సొంతం చేసుకున్నట్టు గుర్తు చేశాడు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు అట్టర్ ఫ్లాప్ అయిన ఆటగాళ్లను హైదరాబాద్ నుంచి తీసుకుని బొక్క బోర్లా పడ్డాయని సెటైర్లు పేల్చాడు. ఓ ఆడదాని ముందు రెండు జట్ల ఓనర్లు కుదేలైపోయారని బాంబు పేల్చాడు.