BigTV English

Tapsi: బీటిక్ అమ్మాయి.. ఢిల్లీలో పానీపూరీ బిజినెస్

Tapsi: బీటిక్ అమ్మాయి.. ఢిల్లీలో పానీపూరీ బిజినెస్

Tapsi: బీటెక్ చాయ్ వాలి.. ఈ పేరు గుర్తుందా?.. హర్యానాకు చెందిన వర్తికాసింగ్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరకుండా.. చాయ్ వ్యాపారం ప్రారంభించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అప్పట్లో ఈమె పేరు మారుమ్రోగిపోయింది.


ఇప్పుడు మరో బీటెక్ అమ్మాయి పేరు మారుమ్రోగుతోంది. ఆమే ఢిల్లికి చెందిన తాప్సీ ఉపాధ్యాయ్. పానీ పూరీ బండి నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. బుల్లెట్ బండిపై పానీపూరీ బండి ఏర్పాటు చేసుకొని ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతూ లాభాలను అర్జిస్తోంది.

హరియాణాలోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది తాప్సీ ఉపాధ్యాయ్. కాలేజీలో ఉన్నప్పుడే సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. అప్పటినుంచే బిజినెస్ వైపు ప్రయాత్నాలు మొదలుపెట్టింది. అయితే ఏ బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న సమయంలో ఆమెకు ఓ ఆలోచన వచ్చింది.


ప్రస్తుతం ఎక్కడ బడితే అక్కడ స్ట్రీట్ ఫుడ్ దొరకుతున్నప్పటికీ.. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈక్రమంలో జనాలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ అందించాలని నిర్ణయించుకుంది. బీటెక్ అయిపోయిన వెంటనే తాను అనుకున్న పనిని మొదలు పెట్టింది. ఎయిర్‌ఫ్రైస్ పూరీలను తాయరు చేసి విక్రయించడం మొదటు పెట్టింది.

అతి త్వరలో ఆమె బిజినెస్ క్లిక్ అయిపోయింది. బీటెక్ పానీపూరీవాలీగా ఫేమస్ అయిపోయింది. ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×