Big Stories

Karnataka : క్యాంపు రాజకీయాలు షురూ..! కాంగ్రెస్ అప్రమత్తం..

Karnataka election result live : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం ఖాయమైపోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి విజయం సాధించబోతోంది. మేజిక్ ఫిగర్ మాట ఇక అవసరంలేదు. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. ఆపరేషన్‌ కమలం ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే చర్యలు చేపట్టింది.

- Advertisement -

గెలుపొందిన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలించేందుకు కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోందని సమాచారం. ఈ విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రికి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పరిస్థితులను బట్టి అక్కడ నుంచి తమిళనాడు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

హంగ్ వస్తుందేమోనన్న అంచనాతో తొలుత బీజేపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసే యోచన చేసింది. జేడీఎస్ తో మంతనాలు ప్రారంభించింది. నేరుగా అమిత్ షా రంగంలోకి చర్చలు మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ తర్వాత బీజేపీ వెనక్కి తగ్గింది. ఓటమిని అంగీకరిస్తూ సీఎం బసవరాజ్ బొమ్మై స్వయంగా ప్రకటన చేశారు.

కర్ణాటకలో భారీ విజయం ఖాయమైన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశం నిర్వహించే యోచన చేస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News