BigTV English

Road Accident : బస్సు – కారు ఢీ.. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోరప్రమాదం

Road Accident : బస్సు – కారు ఢీ.. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోరప్రమాదం

Car hits bus on agra-lucknw expressway: ఉత్తరప్రదేశ్ లోని ఇటావాలో ఆగ్రా – లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడ్డారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.


కారు అదుపుతప్పి.. లేన్ నుంచి బయటకు వెళ్లి అటువైపు రాయ్ బరేలీ నుంచి ఢిల్లీకి వస్తున్న స్లీపర్ బస్సును ఢీ కొట్టినట్లు పోలీసులు వివరించారు. ప్రమాద తీవ్రతలో బస్సు ఎక్స్ ప్రెస్ వే పై నుంచి పడిపోయింది. దాంతో అందులో ఉన్న ప్రయాణికులు కాపాడాలని కేకలు పెట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

మృతులు కన్నౌజ్ కు చెందిన ప్రద్యుమ్ (24), మోను (25), చందా (50) గా గుర్తించారు. బస్సులో ఉన్నవారిలో లఖింపూర్ ఖేరీకి చెందిన ఓం ప్రకాష్ (50), అమేథీ నివాసి రాజు షా, గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని ఎస్ఏపీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


Related News

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Big Stories

×