Anantapur crime news: మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. ప్రియుడి మోజులో పడి అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను కడ తేర్చుస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పైగా ఏమీ తెలియనట్టు వ్యవహరించారు. చివరకు మహిళతోపాటు ప్రియుడు కూడా పోలీసులకు చిక్కాడు. ఈ కేసు డీటేల్స్‌లోకి ఇంకాస్త లోపలికి వెళ్దాం.
శారీరక సంబంధం కోసం
పుట్టపర్తి మండలం వెంగళం చెరువు గ్రామానికి చెందిన నాగేష్ రెండు రోజుల కింద హత్యకు గురయ్యాడు. ఏం జరిగిందో తెలీదుగానీ, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. వాటిని ఆధారంగా రంగంలోకి దిగేశారు. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అవి తెలిసి పోలీసులు షాకయ్యారు.
మృతుని భార్య సునీత అదే గ్రామానికి చెందిన దివాకర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని సునీత భర్త నాగేష్ పసిగట్టాడు. ఈ క్రమంలో భార్య సునీతను భర్త పలుమార్లు మందలించాడు. ఆపై భార్యభర్తలిద్దరు గొడవలు పడిన సందర్భాలు లేకపోలేదు. తన ఆనందానికి అడ్డుపడతావా? అంటూ కోపంతో రగిలిపోయింది. ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని భావించింది.
భర్త హత్యకు ప్లాన్
కొద్దిరోజుల తర్వాత అసలు విషయాన్ని ప్రియుడి దివాకర్‌తో సునీత. మన శారీరక సంబంధానికి తన భర్త అడ్డంగా ఉన్నాడని వివరించింది. తన భర్త నాగేష్‌ను హత్య చేస్తే హాయిగా ఉండవచ్చని చెప్పింది. ప్రియుడు కూడా సునీత చెప్పినట్టే చేశాడు. అయితే నాగేష్‌ను ఎలా చంపాలి అనేదానిపై పక్కాగా స్కెచ్ వేశారు.
ALSO READ: భర్త, ఆడపడుచు కొట్టి చంపారు
ప్రియుడు దివాకర్ ప్లాన్ ప్రకారం వీరాంజనేయ పల్లి గ్రామ సమీపంలోని మామిడితోటను ఎంచుకున్నాడు. ప్రియురాలి చెప్పినట్టే నాగేష్‌కు ఫుల్‌గా మద్యం తాగించాడు. ఆ తర్వాత మత్తులోకి వెళ్లిపోయాడు. తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దారుణంగా మెడపై పలుమార్లు నరికేశాడు. అక్కడకక్కడే నాగేష్ మృతి చెందాడు.
చివరకు పోలీసులు దివాకర్, సునీతను అరెస్ట్ చేశారు. వీరిని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు. తన భర్తను తానే చంపానని, శారీరక సంబంధం కోసం హత్య చేసినట్టు అంగీకరించారు. హత్యకు ఉపయోగించిన వేట కొడవలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.