E-Paper
Advertisement

ఒడిశా తీరంలో రవాణా నౌక బోల్తా.. 22 మంది గల్లంతు? రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన భారత్

ఒడిశా తీరంలో రవాణా నౌక బోల్తా..  22 మంది గల్లంతు? రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన భారత్
Advertisement

Cargo ship sinks In Odisha: ఒడిషా తీరంలో ఊహించని ఘటన. సరుకు రవాణా చేస్తున్న భారీ నౌక ఒకటి మునిగిపోయింది. ఘటన సమయంలో నౌకలో దాదాపు 24 మంది వరకు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే భారత్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అసలు ఘటన ఎలా జరిగింది? సిబ్బంది మాట ఏంటి?

ఒడిశా తీరంలో రవాణా నౌక బోల్తా

బంగాళాఖాతంలోని ఒడిషా తీరానికి సుమారు 240 నాటికల్ మైళ్ల దూరంలో పనామా జెండా కలిగిన కార్గో నౌక మునిగిపోయింది. ఘటన సమయంలో నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 20 మంది చైనాయులు, ముగ్గురు మయన్మార్, బంగ్లాదేశ్ కి చెందినవారు ఒకరు ఉన్నారు. ఘటన గురించి తెలియగానే భారత కోస్ట్ గార్డ్ టీమ్ రంగంలోకి దిగింది. ఇప్పటివరకు ఇద్దరిని కాపాడారు. మిగతా 22 మంది కోసం గాలింపు చేపట్టారు. పనామా జెండా కలిగిన ఎంవి ఓషన్ విన్నర్ నౌక.. ఆగస్టు 20 రాత్రి 10.30 గంటలకు ఒడిశాలోని పారాదీప్ పోర్టు నుంచి సింగపూర్ వైపు బయలుదేరింది. ఈనెల 27న సింగపూర్‌కు చేరాల్సివుంది.

22 మంది గల్లంతు? రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన భారత్

Advertisement

నౌక అంతా 72 వేల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్‌తో నిండి ఉంది. ఒడిషాకు దాదాపు 240 నాటికల్ మైళ్ల దూరంలో అంటే ఆగస్టు 22 ఉదయం 11 గంటల తర్వాత నౌకతో సంబంధాలు తెగిపోయాయి. ఘటన గురించి తెలియానే మారిటైమ్ రెస్క్యూ కో-ఆర్డినేషన్ సెంటర్‌కి విక్టరీ స్టార్ గ్రూప్ కో లిమిటెడ్ నుంచి సహాయం కోరుతూ సమాచారం వచ్చింది. మునిగిపోయిన నౌక పారాదీప్ తీరం నుంచి 240 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు. 225 మీటర్ల పొడవు, 32.26 మీటర్ల వెడల్పు కలిగిన బల్క్ క్యారియర్ కలిగినది ఈ నౌక.  ఓడ మునిగిపోయిన విషయం తెలియగానే భారత తీర రక్షక దళం-నౌకాదళం సంయుక్తంగా గాలింపు చేపట్టాయి.

 

పారాదీప్ పోర్టు నుంచి సింగపూర్‌కు బయలుదేరిన నౌక

Advertisement

సమీపంలోని ఇతర నౌకలను అప్రమత్తం చేసి, గల్లంతైన సిబ్బంది కోసం గాలింపులో సహాయపడమని కోరాయి. మిగిలిన సిబ్బంది కోసం గాలింపు కొనసాగుతోందని ఓడ మునిగిపోవడానికి కారణాలు తెలియరాలేదని అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు సంస్థలు పేర్కొన్నాయి. జరిగిన ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. సముద్ర పరిస్థితులు, సాంకేతిక సమస్యలు, ఇతర అంశాలపై లోతుగా విచారణ చేపట్టారు. నౌక మునిగిపోయిన ప్రాంతం లోతైనది కావడంతో గాలింపు చేపట్టడం కాస్త సవాలుగా మారింది. 22 మంది సిబ్బంది కోసం రాత్రంతా గాలింపు చేపట్టామని భారత తీరప్రాంత బృందాలు తెలిపాయి. గాలింపు చర్యల కోసం ఐసిజి నౌకలు వరద్, అన్మోల్‌లు మోహరించాయి. ఆపరేషన్‌ను బలోపేతం చేయడానికి శ్రీ విజయపురం నుంచి విజిత్‌ను పంపింది కేంద్రం. ప్రాణాలతో బయటపడిన వారిని లైఫ్‌రాఫ్ట్‌లను గుర్తించేందుకు అధికారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.

ALSO READ: సీఎం విజయ్ సంచలనం.. ఏకంగా 1.28 లక్షల గోల్డ్ రింగ్స్‌కు ఆర్డర్.. తమిళనాట రచ్చ రచ్చ!

Tags

Related News

అమెజాన్ ఆఫీసు బయట పేలుడు.. పలువురికి గాయాలు, బెంగుళూరులో ఘటన

మా లాయర్లలో మంచి నటులున్నారు.. వారితో సినిమా తీయండి: సుప్రీంకోర్టు

సీఈసీ నియామక వివాదంలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన సీజేఐ బెంచ్!

పెట్రోల్ బంక్ సీజ్ వివాదం.. ఇండియన్ ఆయిల్ అధికారి దారుణ హత్య.. కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

నడిరోడ్డుపై పడుకుని ప్రియాంక నిరసన.. రాహుల్‌ను ఎత్తుకెళ్లిన పోలీసులు, ఢిల్లీలో హైటెన్షన్!

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

ట్రక్కును ఢీకొట్టిన కారు.. ముగ్గురు టెన్నిస్‌ ప్లేయర్లు దుర్మరణం!

పసి పిల్లలపై తాంత్రికుడి పైశాచికత్వం.. శ్మశానం సమీపంలో ఏం చేశాడంటే.. బీహార్‌లో వెలుగు చూసిన దారుణం

Big Stories

Advertisement
×