Podarillu Today Episode august 23rd: కేశవ ఇంట్లోకి అడుగుపెట్టగానే తేలుతూ మాట్లాడలే నేను వెళ్ళొస్తాను అని అంటాడు. ఇప్పుడే అర్థమవుతుంది ఇంట్లోనే వాళ్ళందరూ కూడా వద్దు అని ఎంత చెప్తున్నా సరే కేశవ్ మాత్రం నేను వెళ్లి తీరాల్సిందే అని మొండిగా వెళ్తాడు.. వెనకాల వెళ్లిన చక్రి వీడు గొడవకి వెళ్తున్నాడు ఏంటి అని అనుకుంటాడు. శైలు వాళ్ళ అన్నయ్యతో కేశవ గొడవపడతాడు.. ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తారు కానీ కేశవా నాకు ఆ కడుపుకి ఏ సంబంధం లేదు అని చెప్పగానే వరాలు శంకరయ్యతో పాటు అందరూ షాక్ అవుతారు. శైలు నాకు అసలు కడుపు లేదు అని నిజం చెప్తుంది ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఏంటి నువ్వు నిజంగానే కడుపుతో లేవా ఎందుకు మరి అబద్ధం చెప్పావు అని అందరూ అడుగుతారు. మీరు నన్ను బలవంతంగా ఫ్రెండ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు.. వాడికి నేను ఎంతగా చెప్తున్న సరే వాడు అసలు వినకుండా.. నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అని శైలు అంటుంది. దానికోసమే నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను అని శైలు నిజం చెప్తుంది. ఆ మాట వినగానే వరాలు ఎంత పరువు తక్కువ పని చేశావే.. నువ్వు ఇలా మన ఇంటి పరువు తీసేస్తావని అసలు అనుకోలేదు. అబద్ధం చెప్పి నలుగురిలో మా పరువు తీసేసెలా మాట్లాడావు అని వరాలు బాధపడిపోతూ ఉంటుంది. నాకు కేశవ అంటే చాలా ఇష్టం. అందుకే తననే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ మీరు మాత్రం మీ ఇష్టమైన వాడితో ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారా..? అందుకే నేను ఇలా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని శైలు అంటుంది.
పెళ్లి చెడగొట్టడానికి నువ్వు కడుపు అని అబద్ధం చెప్తావా అసలు నిన్ను ఏం చేసినా పాపం లేదు అని సురేష్ శైలు నీ కొట్టడానికి ముందుకు వెళ్తాడు.. కానీ అడ్డుపడ్డ కేశవ శైలు నాది తనకు ఏమైనా అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఒక్కొక్కరిని చంపేస్తాను అని అంటాడు. నేను ఇంట్లో లేని సమయం చూసి తనకి బలవంతంగా పెళ్లి చేయాలని అనుకుంటారా మీరు అసలు మనుషులేనా అని కేశవ వాళ్ళ పై సీరియస్ అవుతాడు. కానీ శైలు మాత్రం నువ్వు గొడవ పడొద్దు రా నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి చాలా చాలా చెప్పాలి పద బయటికి వెళ్దామని అంటుంది. అయితే వెనకలే చక్రి కూడా శైలు వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇచ్చి మరి వెళ్ళిపోతాడు.
శైలు నీతో మాట్లాడాలి పదాన్ని బయటకు తీసుకుని వెళుతుంది. అయితే ఈ వెనకాల చెక్రి వెళ్లడంతో ఏంట్రా నువ్వు మా వెనకాల వస్తున్నావు. కొంచెం దూరంగా వెళ్లొచ్చు కదా. పర్సనల్గా మాట్లాడుకోవాలి అని కేశవ అంటాడు.. ఇక శైలు కూడా డ్యూడ్ నువ్వు కొంచెం దూరంగా ఉంటే మేము పర్సనల్ గా మాట్లాడుకుంటాము అని అంటుంది. కేశవ, శైలు కొత్త దూరం వెళ్లిన తర్వాత నాకు ప్రెగ్నెంట్ అని చెప్పగానే చాలా టెన్షన్ వేసింది. ఎంత భయపడిపోయానో తెలుసా అని కేశవ అంటాడు. నువ్వు భయపడ్డావు కదా నువ్వు నీ భయం పోవడానికి నేను హాగ్ ఇస్తాను అని శైలు హగ్ ఇవ్వగానే కేశవ ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉంది అని అంటాడు. వీళ్ళిద్దరూ హాగ్ చేసుకోవడం చూసినా చక్రి అప్పుడే వీళ్ళు మొదలు పెట్టేసారా అని అనుకుంటారు. ఆ తర్వాత శైలు కేశవా నీ కొట్టడంతో.. చక్రి షాక్ అవుతాడు. వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఇక ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. అయితే ఇంటికి వెళ్తున్న సమయంలో చక్రి నవ్వుతూనే ఉంటాడు.
మాధవ్ అలాగే మహాలక్ష్మి ఇద్దరు కూడా కేశవ వాళ్ళు వెళ్లారు కదా ఇంకా రాలేదు ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన చక్రిని చూసి కేశవ కేశవ అని చూసి చక్రి ఇద్దరూ మౌనంగా ఉంటారు. కానీ మధ్యలో చక్రి పక్కపక్క నవ్వడంతో మాధవ్ కి ఏదో అనుమానం వస్తుంది ఏం జరిగిందని అంటాడు. ఏం లేదు అసలు వీడు తండ్రి కాలేదు. ఆ అమ్మాయి పెళ్లి జరుగుతుందని ఎలా అబద్దం చెప్పింది అని చెప్పగానే.. మాధవ్ నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు అని నాకు తెలుసు ఇప్పుడు వాళ్లు అర్థం చేసుకుంటారు అని అంటాడు.. ఇక తర్వాత మహాలక్ష్మి పోనీలెండి మీరు మంచి వాళ్ళని తెలిసింది కదా ఇక మీకే నచ్చినట్టు చేస్తారు అని అంటుంది.. నన్ను క్షమించు రా నిన్ను తప్పుగా అనుకున్నందుకు అని కేశవ అని అడిగితే నిన్ను ఎందుకు క్షమించాలి అన్నయ్య నువ్వు మంచోడివి కదా అని కేశవ్ అంటాడు.. ఇక తర్వాత శైలుకి ఇంట్లో వాళ్ళు మరింత క్లాస్లు పీకుతారు.. దాంతో తను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. మీరు నాకు వాడిని తప్ప ఎవర్నించి పెళ్లి చేసిన ఇలానే పరిస్థితులు ఉంటాయని వార్నింగ్ ఇస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ గొడవ.. పాపం నర్మద.. చందుకు అనుమానం..