E-Paper
Advertisement

పెళ్లి దుస్తుల్లో వైద్యం చేసిన వధువు.. కాసేపు పెళ్లి వేడుకలు వాయిదా, వీడియో వైరల్

పెళ్లి దుస్తుల్లో వైద్యం చేసిన వధువు.. కాసేపు పెళ్లి వేడుకలు వాయిదా, వీడియో వైరల్
Advertisement

Kannur: పెళ్లి వేడుకలో అస్వస్థతకు గురైన ఇద్దరు క్యాటరింగ్ సిబ్బందికి పెళ్లి కూతురి దుస్తుల్లో ఉన్న వధువు ప్రథమ చికిత్స అందించారు. ఆ సమయంలో వివాహ వేడుకను పక్కన పెట్టి వారిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో గిరగిరా తిరుగేస్తోంది. అసలు ఏం జరిగింది? ఎక్కడ అన్న డీటేల్స్ లోకి వెళ్లొద్దాం.

 

పెళ్లి దుస్తుల్లో వైద్యం చేసిన వధువు

Advertisement

కేరళలోని కన్నూర్‌ జిల్లా పనూర్‌ పట్టణంలో పెళ్లి వేడుక జరుగుతోంది. వధువు-వరుడు కుటుంబాల సభ్యులతో కల్యాణ మండపం కళకళలాడుతోంది. ఎండీ చదువుతున్న డాక్టర్‌ షిరీన్- డాక్టర్‌ రిజాజ్‌లకు పెళ్లి కుదిర్చారు పెద్దలు. ఈ వివాహ వేడుకల్లో కేటరింగ్‌ విధులు నిర్వహిస్తున్నారు ఇద్దరు యువతులు. అయితే ఉన్నపళంగా వారిద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరికి ముక్కు నుంచి రక్తం కారుతుండగా, మరొకరు కళ్లు తిరిగి స్పాట్‌లో పడిపోయారు. పెళ్లి వేడుకలతో సందడిగా మారిన సమయంలో బంధుమిత్రుల ద్వారా ఈ విషయం వధువు డాక్టర్‌ షిరీన్‌ చెవిలో పడింది.

 

కేరళలోని కన్నూర్‌ జిల్లాలో ఘటన

Advertisement

పెళ్లి దుస్తుల్లో ఉన్న డాక్టర్ షిరీన్.. వేడుకలను అర్ధంతరంగా ఆపింది. వెంటనే బాధిత యువతుల వద్దకు వేగంగా వచ్చారు. సుమారు పావుగంటపాటు శ్రమించి ఇద్దరికీ చికిత్స చేశారు. ఆ తర్వాత ఇద్దరు యువతులు మెల్లగా కోలుకున్నారు. కోలుకున్న తర్వాత పెళ్లి వేడుక యథాతధంగా కొనసాగింది. కాబోయే తన జీవిత భాగస్వామిని వరుడు డాక్టర్‌ రిజాజ్‌ అభినందించారు. దీనిపై నవ వధువు డాక్టర్ షరీన్ నోరు విప్పింది. అక్కడి పరిస్థితిని చూసి ఓ వైద్యురాలిగా స్పందించానని, ఎవరైనా వీడియో తీస్తున్నారా లేదా అనేది గమనించలేదని ఓ టీవీ ఛానల్‌తో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మనం చేయగలిగినది అక్కడికక్కడే చేసి.. ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు.

 

నవవధువుపై నెటిజన్స్ ప్రశంసలు

ప్రాథమిక ప్రథమ చికిత్స అవగాహన ప్రాముఖ్యతను షిరిన్ నొక్కి చెప్పింది. ప్రథమ చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే వ్యక్తి ప్రాణాలతో బయటపడే అవకాశాలు తగ్గిపోతాయని  అన్నారు. తాను ట్రీట్మెంట్ చేస్తున్న వీడియో తర్వాత చూశానని, చాలామంది తనకు ఫార్వార్డ్ చేశారని వివరించింది. అది కేవలం మా విధి మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని చెప్పారు. షిరీన్ భర్త డాక్టర్ రిజాజ్ ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థోపెడిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. కొత్త పెళ్లికూతురి కమిట్‌మెంట్‌, వరుడు రిజాజ్‌తోపాటు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ALSO READ: జార్ఖండ్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. టర్బైన్ పేలి ముగ్గురు ఇంజనీర్లు మృతి!

 

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×