BigTV English

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Kolkata Rape Case CBI| దేశవ్యాప్తంగా దుమారం రేపిన కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాతీయా మీడియా కథనాలు ప్రచురించింది. రేప్ కేసు నిందితుడి సంజయ్ రాయ్ కు శుక్రవారం కోర్టు దాదాపు బెయిల్ ఖరారు చేసినంత పని జరిగింది. కేసు విచారణ చేస్తున్న సిబిఐ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని సమాచారం.


కోల్ కతాలోని సీల్దా కోర్టులో శుక్రవారం సెప్టెంబర్ 6న మహిళా డాక్టర్ రేప్, హత్య కేసులో నిందితుడికి బెయిల్ పిటీషన్ విచారణ జరుగుతుండగా.. సిబిఐ అధికారులు కానీ, సిబిఐ లాయర్ కానీ విచారణకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి పమేలా గుప్తా ఆగ్రహం చెందారు. ”ఇంత నిర్లక్ష్యమా?.. ఇలాగైతే నిందితుడు సంజయ్ రాయ్ కు బెయిల్ ఇచ్చేయాలా?” అని మండిపడ్డారు.

అయితే సంజయ్ రాయ్ బెయిల్ పిటీషన్ విచారణకు సిబిఐ లాయర్ విచారణ మొదలైన 50 నిమిషాల తరువాత హాజరయ్యారు. సిబిఐ తరపున సీనియర్ అధికారులెవరూ హాజరుకాకపోవడం ఆందోళనకరం. అయితే నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ విచారణకు సిబిఐ తరపున ఒక జూనియర్ మహిళా అసిస్టెంట్ హాజరయ్యారు. ఇదంతా చూసిన న్యాయమూర్తి ఆగ్రహం చెంది.. సిబిఐ తరపున వచ్చిన మహిళా అసిస్టెంట్ కు హెచ్చరించారు. ”మీ లాయర్ ఇంతవరకూ రాలేదు. ఆయన వస్తారా? లేదా? త్వరగా చెప్పండి?. కోర్టు సమయం వృథా అవుతోంది.” అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.


Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

న్యాయమూర్తి సీరియస్ కావడంతో సిబిఐ అసిస్టెంట్ బయటికి వెళ్లి 15 నిమిషాల తరువాత తిరిగి వచ్చింది. ”లాయర్ బయలుదేరారని.. 15 నిమిషాల్లో కోర్టుకు చేరుకుంటున్నట్లు తాను ఫోన్ చేస్తే తెలిసిందని” వివరించింది.

మరోవైపు సంజయ్ రాయ్ తరపున వాదించే లాయర్ కవితా సర్కార్.. తన క్లైంటు కు ఎటువంటి నేర చరిత్ర లేదని, పైగా సిబిఐ ఇంతవరకు సరైన ఆధారాలు కోర్టులో సమర్పించలేదని వాదిస్తూ.. బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అడిగారు. అప్పుడే అక్కడికి సిబిఐ లాయర్ దీపక్ పోరియా చేరుకొని.. సిబిఐ విచాణ ఇంకా పూర్తి కాలేదని.. నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ పై విడుదలైతే విచారణకు ఆటంకం కలుగుతుందని.. అందుకే బెయిల్ మంజూరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే న్యాయమూర్తి సిబిఐ లాయర్ ని ప్రశ్నిస్తూ.. ఇంతకు ముందు వాదించిన సిబిఐ లాయర్ ఎందుకు రాలేదని అడిగారు. దానికి లాయర్ దీపక్ సమాధానమిస్తూ.. ఆయన సిబిఐ ఫుల్ టైమ్ లాయర్ అని.. ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరని.. అందుకే తాను వచ్చానని తెలిపారు. ఇదంతా విని న్యాయమూర్తి పమేలా గుప్తా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బెయిల్ పిటీషన్ విచారణని సెప్టెంబర్ 20కి వాయిదా వేశారు.

మహిళా డాక్టర్ హత్యాచారం కేసు చాలా సీరియస్ అని.. విచారణ చేస్తున్న సిబిఐ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అని అన్నారు.

మరోవైపు బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్.. మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సిబిఐ, బిజేపీ, మోదీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తున్నారని.. ఈ కేసుని కప్పిపుచ్చేందుకే నిందితుడికి బెయిల్ వచ్చేలా విచారణ జరుపుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ట్విట్ చేశారు. ”రేప్ కేసు నిందితుడు ఆ రాక్షసుడిని బెయిల్ పై విడుదల ఎలా చేస్తారు? బిజేపీ, సిబిఐ నీచ ఎజెండా ఇదేనా? సిబిఐ అధికారులు విచారణ కోసం కోర్టుకు ఎందుకు రాలేదు?” అని తన ట్వీట్ లో సాకేత్ గోఖలే ప్రశ్నించారు.

Related News

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Big Stories

×