BigTV English

CBSE Exams: CBSE 10,12 పరీక్షల షెడ్యూల్ తేదీలు మార్పు.. తాజా టైం టేబుల్ ఇదే..

CBSE Exams: CBSE 10,12 పరీక్షల షెడ్యూల్ తేదీలు మార్పు.. తాజా టైం టేబుల్ ఇదే..

CBSE Exams: సీబీఎస్ఈ 10,12 తరగతుల పరీక్షల తేదీల్లో కొన్ని మార్పులు చేసినట్లు CBSE బోర్డు తెలిపింది. కొన్ని సబ్జెక్టుల పరీక్షలను రీ షెడ్యూల్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు CBSE వెబ్ సైట్ లో తాజా షెడ్యూల్ ను చూసుకోవచ్చని తెలిపింది.


10వ తరగతి పరీక్షల షెడ్యూల్ లో ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్ పేపర్ ను ఫిబ్రవరి 28వ తేదీకి మార్చారు. అలాగే మార్చి 4,5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్, ఫ్రెంచ్ పరీక్షలను కూడా రీ షెడ్యూల్ చేశారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్, 23న టిబెటన్ పరీక్షను నిర్వహించనున్నారు.

12వ తరగతి పరీక్షల షెడ్యూల్ లో ఒక పరీక్ష తేదీని మార్చినట్లు బోర్డు పేర్కొంది. మార్చి 11న జరగాల్సిన ఫ్యాషన్ స్టడీస్ సబ్జెక్టును మార్చి 21వ తేదీకి మార్చారు. CBSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు పరీక్షలు మొదలవుతాయని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.


రెండు సబ్జెక్టులకు మధ్య ప్రిపరేషన్ కు గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షల దృష్ట్యా తాజాగా పరీక్షల డేట్ షీట్ లను రూపొందించినట్లు ఎగ్జామ్స్ కంట్రోలర్ డా.సన్యం భరద్వాజ్ గతంలోనే తెలిపారు.

https://www.cbse.gov.in/cbsenew/documents/DATE_SHEET_CLASS_XII_Revised_03012024.pdf

https://www.cbse.gov.in/cbsenew/documents/DATE_SHEET_CLASS_X_Revised_03012024.pdf

Tags

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×