Mega Job Fair: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. జులై 23న హైదరాబాద్, మాదాపూర్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్నవారు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. టెన్త్ ఆపై అర్హతలు ఉన్న వారందరూ ఈ జాబ్ మేళాకు అటెండ్ అవ్వొచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి జీతం కూడా ఉంటుంది. ప్రముఖ పేరుగాంచిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాబ్ మేళా ఎక్కడ..? ఏ రంగాల్లో వెకెన్సీలు ఉన్నాయి.. ఏ రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైదరాబాద్, మాదాపూర్‌లోని 100 ఫీట్ రోడ్డు సమీపంలోని శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జులై 23న ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారికి ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా నిరుద్యగో అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు అవ్వండి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, ఐటీ, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ రంగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు కూడా చేసుకునే అవకాశం ఉంది.
జాబ్ మేళా ప్లేస్: మాదాపూర్, శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్
జాబ్ మేళా తేది: జులై 23
సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
విద్యార్హత: టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, బీఫార్మసీ, నర్సింగ్, పీజీ వంటి అర్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు.
ఏ రంగాల్లో వెకెన్సీ ఉన్నాయంటే..?
ఫార్మా, ఐటీ, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ వంటి వివిధ రంగాల్లోని ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కూడా కలగజేస్తున్నాయి. రిమోట్ వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు..
⦿ జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులు కచ్చితంగా రెజ్యూమ్ తెచ్చుకోవాలి.
⦿ ఈ జాబ్ మేళాకు అర్హతలున్న వారు ఎవరైనా అటెండ్ అవ్వొచ్చు.
⦿ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకే..
⦿ జాబ్ మేళాకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.
ALSO READ: Railway Jobs: రైల్వేలో 6వేలకు పైగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ నీదే బ్రో..