BigTV English

NEET UG 2024 Row: నీట్‌లో అవకతవకలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ!

NEET UG 2024 Row: నీట్‌లో అవకతవకలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ!

CBI Files Case on NEET UG 2024: నీట్-యూజీ 2024లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తును కేంద్రం సీబీఐకు అప్పగించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సీబీఐ యూజీసీ-నెట్ పేపర్ లీక్‌పై కేసు నమోదు చేసి.. విచారణ వేగవంతం చేసింది.


నీట్ యూజీ 2024లో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర సంస్థకు అప్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో గుర్తు తెలియని వ్యక్తులను నిందితుల జాబితాలో చేేర్చినట్లు సీబీఐ స్పష్టం చేసింది.

నీట్ యూజీ, యూజీసీ నెట్‌కు సంబంధించి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇవాళ జరగవలసిన నీట్ పీజీ పరీక్షను రద్దు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కొత్త తేదీని ఆరోగ్య శాఖ త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొంది.


Also Read: నీట్-పీజీ వాయిదా.. లీకేజీ ఆరోపణలే కారణమా?

దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ప్రతిపక్షాల దాడులతో పాటు నీట్‌-యూజీలో అవకతవకలు, యూజీసీ నెట్ పరీక్ష రద్దుపై వివాదం తలెత్తిన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చీఫ్‌ను కేంద్రం తన పదవి నుంచి తొలగించింది.

ఎన్టీయే డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సుబోధ్ కుమార్ సింగ్ స్థానంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలాను నియమించినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×