BigTV English

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”

Home Minister Amit Shah on Wayanad Tragedy : వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 180 మంది మరణించగా 130 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతుల్లో 75 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యలో వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.


తాజాగా వయనాడ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కేరళలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై రాజ్యసభలో ఓ ప్రకటన చేశారాయన. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ముందే హెచ్చరించామని, జూలై 23నే అప్రమత్తం చేసినా.. కేరళ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్ర పౌరులను సకాలంలో తరలించలేదని తెలిపారు. కేరళలో భారీవర్షాలు మొదలవ్వగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని చెప్పారు.

Also Read : వయనాడ్ వెళ్తుండగా మంత్రి కారుకి ప్రమాదం.. స్వల్ప గాయాలు


ప్రకృతి వైపరీత్యాల గురించి వారంరోజుల ముందుగానే హెచ్చరించే వ్యవస్థ భారత్ లో ఉందన్నారాయన. ప్రపంచంలో ఇలాంటి సాంకేతికత ఉన్న 4 దేశాల్లో మనదేశం ఒకటని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళకు చేరుకున్న వెంటనే అప్రమత్తమై.. ఆ ప్రాంతవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లైతే.. వయనాడ్ ఇంతటి విషాదాన్ని చూసేది కాదన్నారు అమిత్ షా. ఈ ప్రమాదంతో తీరని విషాదంలో ఉన్న కేరళ ప్రజలకు.. మోదీ సర్కార్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×