BigTV English

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Central Ministers Respond on Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీల నేతలు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్రమంత్రులు వరసగా స్పందిస్తున్నారు.


భక్తకోటిని కలవరపెడుతున్న తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్రమంత్రులు రియాక్ట్ అయ్యాకు. కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. శ్రీవారి తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పూర్తి నివేదికను కోరినట్లు జేసీ నడ్డా పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం పరీశీలించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ విషయంపై కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనది. దీనిపై అన్ని విషయాలు స్పందించి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. తిరుమల లడ్డు వ్యవహారం ప్రజలందరిని ఆందోళనకు గురి చేస్తుందని ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినదని ఆమె తెలిపారు.


Also Read: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

ఈ విషయంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తమ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. తిరుపతి కాలేజీల్లో శ్రీవారి ఫోటోలను తొలగించాలని జగన్ అండ్ కో చూసిందని ఆమె పేర్కొంది. హిందూయేతర గుర్తులు సప్తగిరులపై ఏర్పాటు చేయాలని చూశారని విమర్శలు గుప్పించారు. హిందువులు కానివారిని బోర్డ్‌ ఛైర్మన్‌గా నియమించారని ఆక్షేపించారు. జంతువుల కొవ్వులను పవిత్ర ప్రసాదంలో కలిపారని దుయ్యబట్టారు. స్వామీ ఈ హిందూ వ్యతిరేక రాజకీయాలకు మమ్ము క్షమించు అని శోభా కరంద్లాజే వ్యాఖ్యానించారు.

మరోవైపు తిరుపతి లడ్డూ కల్తీ విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ అంశం హిందువుల మనోభావాలను కలిచి వేస్తుందని చెప్పారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా గతంలో పట్టించుకోలేదని ఆరోపించారు. లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం నీచమని విమర్శించారు. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగిందని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. నెయ్యిని కల్తీ చేసి క్షమించరాని నేరం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బండి సంజయ్ ఆరోపించారు. సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×