BigTV English

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Star Heroine.. ఏ ఫిలిం ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్స్ కి లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది . అందుకే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ స్టార్ స్టేటస్ ను అందుకుంటారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్టార్ స్టేటస్ ను అందుకొని ఇప్పుడు ఏకంగా 50 సెకండ్ల కోసం రూ .5 కోట్లు తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచింది.


బాలీవుడ్ హీరోయిన్స్ నే మించిపోయిన ఈమె క్రేజ్..

ఈ రేంజ్ లో పారితోషకం అంటే ప్రతి ఒక్కరు కూడా బాలీవుడ్ హీరోయిన్స్ ను గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా దీపికా పదుకొనే (Deepika Padukone), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), ప్రియాంక చోప్రా(Priyanka Chopra) లాంటి హీరోయిన్ల పేర్లు ముందుగా గుర్తుకొస్తాయి. అయితే వీరెవరు కాదండోయ్ వీరందరినీ మించి ఒక సౌత్ హీరోయిన్ ఈ రేంజ్ లో పారితోషకం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక సౌత్ హీరోయిన్ కి ఈ రేంజ్ పారితోషకమా అంటూ ఆశ్చర్యపోతున్నారా ..? ఆమె ఎవరో కాదు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanatara ). అవునండీ..మీరు విన్నది నిజమే.. నయనతార 50 సెకండ్ల నిడివి ఉన్న ఒక యాడ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.


50 సెకండ్ల కోసం రూ .5 కోట్లు..

Star Heroine: This heroine craze is not normal.. Rs. 5 crore for 50 seconds..?
Star Heroine: This heroine craze is not normal.. Rs. 5 crore for 50 seconds..?

అసలు విషయంలోకి వెళితే నయనతార.. నయనతార ప్రముఖ డీటీహెచ్ సంస్థ అయిన టాటా స్కై యాడ్ కోసం ఏకంగా భారీ మొత్తంలో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు రోజులపాటు ఈ యాడ్ కోసం షూట్ చేశారట. ఈ యాడ్ తెలుగు, తమిళ్ , మలయాళం, కన్నడ భాషలలో ప్లే అవుతుందని సమాచారం. రెండు రోజులపాటు షూటింగ్ చేసినా.. ఈ యాడ్ నిడివి కేవలం 50 సెకండ్లు మాత్రమే. మరి ఈ 50 సెకండ్ల యాడ్ కోసం ఈమె ఏకంగా రూ కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఇంత తక్కువ సమయానికి అంత పెద్ద మొత్తం తీసుకొని భారతదేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకున్న నటిగా రికార్డు సృష్టించింది లేడీ సూపర్ స్టార్ నయనతార.

నయనతార కెరియర్..

ఇక నయనతార విషయానికి వస్తే.. మొట్టమొదటిసారి 2003లో వచ్చిన మలయాళం మూవీ మనసినక్కరే అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. ఆ తర్వాత రజినీకాంత్ తో చంద్రముఖి సినిమాలో చేసి మంచి స్టేటస్ అందుకుంది. ఇక తెలుగు చిత్రాలలో కూడా నటించి మెప్పించిన నయనతార.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ .10 కోట్ల పారితోషకం తీసుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఇటీవల బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టడంతో అక్కడ ఈమె రేంజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. షారుక్ ఖాన్ జవాన్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి, అక్కడి స్టార్ హీరోయిన్లతో సమానంగా పారితోషకం తీసుకుంటూ దూసుకుపోతోంది. ఏది ఏమైనా నయనతార రేంజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×