Waqf Bill in Lok Sabha: పార్లమెంట్ మరోసారి దద్దరిల్లనుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. దీంతో.. విపక్షాలు కూడా కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. నిన్న ఇండియా కూటమి పార్టీల నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కూటమి నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్‌కు కాంగ్రెస్, శివసేన, సీపీఎం సహా పలు కీలక పార్టీలు హాజరైయ్యాయి.
లోక్‌సభలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో చర్చించారు. ఈ బిల్లుపై చర్చలో క్రియాశీలంగా పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. ఈ బిల్లును అమలు చేస్తే జరిగే నష్టాన్ని క్లియర్ గా ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. అందుకే బిల్లుపై జరిగే చర్చలో తమ వాదన గట్టిగా వినిపించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కానీ.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించారు.
వక్ఫ్ బిల్లుపై మోదీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధమైన, విభజన అజెండాను ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. పార్లమెంటులో విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని ఆయన పోస్టు పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 3 రోజులు సభ్యులంతా సభకు హాజరుకావాలని ఆదేశించింది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. మరోవైపు ఈ కీలకమైన బిల్లు లోక్‌సభ ముందుకు వస్తున్న క్రమంలో ఢిల్లీ పోలీసుల అలెర్ట్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ అదుపుతప్పుకుండా సెన్సిటివ్ ఏరియాల్లో భద్రతను పెంచారు. ఆ ప్రాంతాల్లో రాత్రి గస్తీని పెంచడానికి అదనపు బలగాలను దించారు.
☀ బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలు
⦿ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC)
⦿ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPI(M))
⦿ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)
⦿ సమాజ్ వాదీ పార్టీ (SP)
⦿ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (AITC)
⦿ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)
⦿ శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) (SHS(UBT))
⦿ ఎం ఐ ఎం
************
☀ మద్దతు ఇస్తున్న పార్టీలు
⦿ భారతీయ జనతా పార్టీ (BJP)
⦿ నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)
⦿ తెలుగుదేశం పార్టీ (TDP)
⦿ జనతాదళ్ (యునైటెడ్) (JDU)
⦿ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJPRV)
⦿ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU)
⦿ అప్నా దల్ (సోనీలాల్) (ADS)
⦿ అసోం గణ పరిషత్ (AGP)
⦿ శివసేన (ఏక్నాథ్ షిండే) (SHS)
⦿ సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM)
⦿ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL)
☀ వక్ఫ్ (సవరణ) బిల్లు అంటే ఏమిటి?
వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024, 8 ఆగస్టు 2024న లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది, భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సంస్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇది వక్ఫ్ చట్టం, 1995కి మార్పులను ప్రతిపాదిస్తుంది, దాని పేరును ‘యునైటెడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్, 1995’ (UWMEEDA 1995)గా మార్చారు.
సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ నమోదును క్రమబద్ధీకరించడం, పర్యవేక్షణను మెరుగుపరచడం ఈ బిల్లు లక్ష్యం.. అదనంగా, ఇది ప్రభుత్వం నియమించిన ఆడిటర్లచే ఆడిట్‌లను తప్పనిసరి చేస్తుంది. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం సమాజ ప్రయోజనాలకు విరుద్ధమని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలనను మెరుగుపరచడానికి ఈ బిల్లు ప్రయత్నిస్తుంది.