
Chandrayaan 3 rover latest update(Today news paper telugu) :
చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ అద్బుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రతల వివరాలు, సల్ఫర్, ఆక్సిజన్ లాంటి మూలకాల లభ్యత సమాచారాన్ని ఇస్రోకి పంపించింది రోవర్. ఈ క్రమంలో ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ఇప్పటివరకు 100 మీటర్లకు పైగా దూరం ప్రయాణించినట్టు ఇస్రో ప్రకటించింది.
రోవర్ జర్నీ చేసిన మార్గానికి సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేసింది ఇస్రో. ప్రజ్ఞాన్ రోవర్ సెంచరీ కొట్టినట్టు కామెంట్ చేసింది.
మరోవైపు, చంద్రుడిపై ఒక్క పగలు, అంటే 14 రోజులు గడువు సమీపిస్తుండటంతో ఇస్రో అలర్ట్ అయింది. అతిచల్లగా ఉండే రాత్రిని తట్టుకునేందుకు వీలుగా.. రోవర్, ల్యాండర్‌లను క్రమస్థితిలో చేర్చే ప్రక్రియ.. ఒకట్రెండు రోజుల్లో ప్రారంభస్తామని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు.
విక్రమ్, ప్రజ్ఞాన్ ప్రస్తుతం అనుకున్న విధంగానే పనిచేస్తున్నాయని వెల్లడించారు. వాటిలోని పేలోడ్‌లు జాబిల్లిపై విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నాయని తెలిపారు.