BigTV English

Cabinet : జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రోజే మంత్రుల మార్పుపై క్లారిటీ..?

Cabinet : జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రోజే మంత్రుల మార్పుపై క్లారిటీ..?

Cabinet : వచ్చే ఏడాది ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది.త్వరలో కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చేయాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని తెలుస్తోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతోంది. జులై 3న కేబినెట్ భేటీ జరగనుంది. దీంతో మంత్రివర్గంలో మార్పులపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.


జూలై 3న కేంద్ర మంత్రి మండలితో సమావేశం జరుగుతుందని అధికారులు ప్రకటించారు. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆ రోజు మంత్రుల మార్పుపై క్లారిటీ వస్తుందంటున్నారు. బుధవారం అర్ధరాత్రి ప్రధాని మోదీ తన నివాసంలో బీజేపీ సీనియర్‌ నేతలతో సుదీర్ఘ చర్చించారు. లోక్‌సభ ఎన్నికలకు అమలు చేయాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. మంత్రిమండలిలో మార్పులపైనా చర్చించారని సమాచారం. కేంద్ర మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి చోటు కల్పిస్తారని తెలుస్తోంది.

సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ జరుగుతుంది.జులై మూడో వారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, రాష్ట్రాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహించారు.


ఈ ఏడాది చివరి నాటికి 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఆ తర్వాత 4 నెలలలోపే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో కాషాయ పార్టీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×