Air India: ఎయిరిండియాలో చాట్‌జీపీటీ సేవలు..

Air India: ఎయిరిండియాలో చాట్‌జీపీటీ సేవలు..!

ChatGPT services in Air India
Share this post with your friends

Air India : ఎయిరిండియా డిజిటల్‌ వ్యవస్థలను ఆధునికీకరించే చర్యలు చేపట్టింది. చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్‌ వినియోగించబోతోంది. ఇప్పటికే ప్రాథమిక పెట్టుబడుల కింద రూ.1600 కోట్లను ఖర్చు చేసింది. కంపెనీ రూపురేఖలను మార్చడం కోసం విహాన్‌.ఏఐ పేరిట ఒక పథకాన్ని ఎయిరిండియా ప్రవేశపెట్టింది. ప్రపంచస్థాయి విమానయాన సంస్థల సరసన నిలిచేందుకు వచ్చే ఐదేళ్లలో మరిన్ని పెట్టుబడులు పెట్టనుంది.

ఏఐ ఆధారిత ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని ఎయిరిండియా భావిస్తోంది. కొన్ని సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించేందుకు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అప్లికేషన్లను వినియోగించాలని యోచిస్తోంది.

వెబ్‌ సైట్‌, మొబైల్‌ యాప్‌ల ఆధునికీకరణ చేపట్టింది. చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్‌ అందుబాటులోకి తీసుకొస్తోంది. విమానం లోపల వినోద సేవలను ఆధునికీకరించింది. రియల్‌ టైమ్ లో వినియోగదార్లు తమ సపోర్ట్‌ సేవల విజ్ఞప్తులను ట్రాక్‌ చేసుకునేలా కస్టమర్‌ సేవల పోర్టల్‌ లో మార్పులకు శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ మార్కెటింగ్‌, కాంటాక్ట్‌ సెంటర్‌ ఆధునికీకరణ, సెల్ఫ్‌ సర్వీస్‌ రీ-అకామడేషన్‌, కస్టమర్‌ ఫీడ్‌బ్యాక్‌, అనాలసిస్‌ లాంటి అంశాల్లో కొత్త సాంకేతిక వ్యవస్థలను వినియోగించనుంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Dakshinamurthy :- దక్షిణామూర్తిని పూజిస్తే ఆ బాధల నుంచి విముక్తి

Bigtv Digital

Kashmir University Students : ఈ రైస్ కుక్కర్ డయాబెటిస్ ఉన్నవారికి ప్రత్యేకం

BigTv Desk

Rahul Gandhi: బ్రేకింగ్ న్యూస్.. రాహుల్ గాంధీ యాత్ర రద్దు..

Bigtv Digital

Basikam :బాసికం ఎందుకు కడతారు..?

Bigtv Digital

Chiranjeevi: దశాబ్దాల నిరీక్షణ.. అవార్డు స్వీకరణ.. యువ హీరోలకు కష్టకాలమే: చిరంజీవి

BigTv Desk

Contact Lens : ఆ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే చాలు ప్రపంచం మీ కళ్ల ముందే

BigTv Desk

Leave a Comment