BigTV English

Parliament Security: CISF కనుసన్నల్లో పార్లమెంట్‌ భవన్.. సర్వే చేయనున్న నిపుణులు

Parliament Security: CISF కనుసన్నల్లో పార్లమెంట్‌ భవన్.. సర్వే చేయనున్న నిపుణులు

Parliament Security: లోక్‌సభలో స్మోక్ బాంబ్ ఇష్యూ మొత్తం దేశాన్ని షేక్ చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతం పార్లమెంట్‌. అలాంటి పార్లమెంట్‌లోకి మూడంచెల భద్రతను దాటుకొని వచ్చి స్మోక్‌ బాంబ్ ఎలా పేల్చారన్నది ఇప్పుడు అధికారులను కలవర పడేలా చేసింది. అదే సమయంలో పార్లమెంట్‌ భద్రతపై కూడా కొత్త అనుమానాలను తెరపైకి వచ్చేలా చేసింది.


పార్లమెంట్‌ దాడి ఘటనకు సంబంధించి కేంద్రం అప్రమత్తమైంది. ఉభయ సభల భద్రతా బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పార్లమెంట్ భవన సముదాయాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

CISF అనేది సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్స్‌లో ఒక భాగం. ప్రస్తుతం ఢిల్లీలోని అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలతో పాటు కీలకమై అణు, ఏరోస్పేస్ డొమైన్, ఎయిర్‌పోర్ట్‌లు, ఢిల్లీ మెట్రో వంటి వాటికి రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తోంది CISF. ఇకపై పార్లమెంట్‌ భవన్‌ కూడా CISF ఖాతాలో చేరిపోనుంది.


ప్రస్తుత పార్లమెంట్ భవనంలోని భద్రతా బృందంలోని అధికారులతో పాటు భద్రతా బలగాలకు చెందిన ఫైర్ కంబాట్ ,రెస్పాన్స్ అధికారులు త్వరలో పార్లమెంట్ సర్వే చేపట్టనున్నారు. CISFలో పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్, ఢిల్లీ పోలీస్, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ కూడా ఉంటాయి. త్వరలో సర్వే నిర్వహించి ఎంతమంది కమాండోలను నియమించాలో తేల్చనున్నారు అధికారులు.

పార్లమెంట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసే ఆలోచనలో ఉంది CISF. ఎయిర్‌పోర్ట్‌లో పాటించే ప్రోటోకాల్‌ను పార్లమెంట్‌లో అమల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది CISF. షూస్, హెవీ జాకెట్స్‌, బెల్ట్‌లను కూడా స్కాన్‌ చేయగల పెద్ద స్కానర్లను అందుబాటులోకి తీసుకు రానుంది CISF.

.

.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×