BigTV English

Ajmer Clashes: ఆజ్మీర్‌లో స్ట్రీట్ ఫైటింగ్.. రెండు వర్గాలు మధ్య రోడ్డుపై

Ajmer Clashes: ఆజ్మీర్‌లో స్ట్రీట్ ఫైటింగ్.. రెండు వర్గాలు మధ్య రోడ్డుపై

Ajmer Clashes: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రెండు వర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ప్రస్తుతం అంతా కంట్రోల్‌గా ఉంది.


రాజస్థాన్‌లోని ఆజ్మీర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం రెండు వర్గాల ఘర్షణలు జరిగాయి. జైన సమాజ్ గ్రూపు.. రూపన్‌గడ్ ప్రాంతంలో భారీ భవనం నిర్మిస్తోంది. దీని వ్యవహారంపై రెండు గ్రూపుల మధ్య వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు.

ALSO READ: లోదుస్తుల్లో ఉండి.. కరెంట్ తీగ బాడీకి చుట్టేసుకుని.. వర్క్ ప్రెజర్ తట్టుకోలేక టెకీ ఏం చేశాడంటే?


ఈ నేపథ్యంలో ఓ యువకుడు మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. రెచ్చిపోయిన మరో వర్గం, జేసీబీలతోపాటు వాహనాలకు ధ్వంసం చేసింది, ఆపై నిప్పు పెట్టింది. ఈ వ్యవహారం తారాస్థాయికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.

భారీ ఎత్తున బలగాలు ఆ ప్రాంతంలో మొహరించాయి. చివరకు ఇరువర్గాల ప్రజలను శాంతింప చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలపెట్టారు. హింసకు కారణమైన ఇరువర్గాల వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిని షకీల్‌గా గుర్తించారు.

 

 

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×