BigTV English

Trinayani Serial Today September 23rd: ‘త్రినయని’ సీరియల్‌: భుజంగమణికి దారి చెప్పిన గాయత్రిదేవి – విశాల్‌, గాయత్రి పాపతో బయలుదేరిన నయని

Trinayani Serial Today September 23rd: ‘త్రినయని’ సీరియల్‌: భుజంగమణికి దారి చెప్పిన గాయత్రిదేవి – విశాల్‌, గాయత్రి పాపతో బయలుదేరిన నయని

trinayani serial today Episode:  గాయత్రి దేవి చెప్పింది ఒకటైతే నయని చెప్పింది మరోకటి అని ముసుగు వేసుకుని వింటున్న గజగండ అనుకుంటాడు. తిలొత్తమ్మ కూడా ఏంటి నయని విశాల్‌ బాధపడతాడని అలా చెప్తున్నావా? అని అడుగుతుంది. దీంతో నయని నా మాట ఎవరు అర్థం చేసుకోకపోయినా అమ్మగారు అర్థం చేసుకుంటారు అంటుంది. గాయత్రిదేవి విశాల్‌ దగ్గరకు వెళ్లి ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో హాసిని తనకు ఒక అనుమానం ఉందని మణికాంతగిరికి వెళ్లాలంటే చెల్లెలికి పుట్టిన బిడ్డ చెప్పాలని అన్నారు మరి మీరు ఎలా చెప్పారు అని అడుగుతుంది. దీంతో గాయత్రిదేవి నేను పుట్టానని చెప్తుంది. దీంతో గజగండ, తిలొత్తమ్మ షాక్‌ అవుతారు. నేను చెప్పింది దారి ఆ దారిన వెళ్లాల్సిన వారు వెళ్తారు. వెళ్లకూడని వాళ్లకు పసిపాప రూపంలో నేనే దారి చూపిస్తాను అని వెళ్లిపోతుంది. దీంతో తిలొత్తమ అక్క వెళ్లిపోతుంది నయని తను ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు అంటుంది. ఇంతలో వల్లభ గజగండకు వెళ్లిపోమ్మని సైగ చేస్తాడు. గజగండ వెళ్లిపోతాడు.


సుమన గూగూల్‌ మ్యాప్స్‌ లో చూస్తూ.. గాయత్రి దేవి చెప్పిన దారిని స్కెచ్‌వేస్తుంది. విక్రాంత్‌ వచ్చి ఏం చేస్తున్నావు అని అడగ్గానే మణికాంతగిరికి వెళ్లే దారి గీస్తున్నానని చెప్తుంది. సరేలే గాయత్రి పెద్దమ్మ చెప్పిన దారిని కరెక్టుగా గీసి ఇవ్వు అని విక్రాంత్‌ చెప్పగానే కష్టమో నష్టమో మనమే మణికాంతగిరి వెళ్దాం అంటుంది సుమన. దీంతో అక్కడికి వెళ్లాలంటే పెట్టి పుట్టాలి అంటాడు విక్రాంత్‌. నువ్వు వెళ్లినా సరే నేను మాత్రం రాను అంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో నువ్వు వస్తేనే నేను వెళ్తాను అని మొండిగా మాట్లాడుతుంది సుమన. దీంతో విక్రాంత్‌ ఎగతాలిగా మాట్లాడటంతో సుమన నేను ఎక్కడికి వెళ్లను అంటూ వెళ్లిపోతుంది.

నయని ఒక్కతే కూర్చుని ఆలోచిస్తుంటే.. గాయత్రి దేవి వస్తుంది. ఆమెను చూసిన నయని ఎమోషన్‌ అవుతుంటే ఏమైందని అడుగుతుంది గాయత్రి. మీరు తెలియదా? అమ్మగారు నేను మణికాంతగిరికి నేను వెళితే ఆ దుర్మార్గుడు గజగండ విశాల్‌ బాబును ఏం చేస్తాడోనని భయంగా ఉందని చెప్తుంది. దీంతో విశాల్ ను కూడా తీసుకెళ్లు అని చెప్తుంది గాయత్రిదేవి.  నీ వెంట నీ బిడ్డ గాయత్రి కూడా వస్తుంది. అని చెప్పగానే గాయత్రిని దత్తత తీసుకుని బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పిన నేనే తనని ఇప్పుడు ఇలా చేస్తే ఎలా చెప్పండి అంటుంది.


దీంతో గాయత్రిని, విశాల్‌ ను నువ్వు మనసాదేవి ఆలయానికి తీసుకెళ్లే టైం వస్తుంది అని చెప్పగానే ఎలా తీసుకెళ్లగలను అని అడుగుతుంది నయని. విశాలాక్షి అమ్మ మీద భారం వేసి అడుగువేయి. వాళ్లను తీసుకెళ్లకపోతే భుజంగమణిని నువ్వు సాధించినా అది ఇస్తే తప్పా గాయత్రిని, విశాల్‌ ను విడిచిపెట్టనని అంటాడు ఆ నీచుడు అని చెప్తుంది గాయత్రి. అయితే నేను నా వాళ్లందరినీ తీసుకెళ్తాను అంటుంది నయని. అలా కుదరదని జన్మ నక్షత్రం ప్రకారమే ఎవరికైనా అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి గాయత్రిదేవి వెళ్లిపోతుంది.

గార్డెన్‌ లో కూర్చున్న విశాల్‌ దగ్గరకు నయని వచ్చి ఇక్కడ కూర్చున్నారేంటి అని అడుగుతుంది.  ఇవాళ పౌర్ణమి కదా నయని అందుకే ఇక్కడ కూర్చున్నాను అంటాడు. దీంతో ఇంకాసేపట్లో చీకటి పడుతుంది. మనం బయల్దేరాలి అంటుంది నయని. కానీ ఆ గజగండ ఎన్ని అడ్డంకులు సృష్టిస్తాడో అని ఆలోచిస్తున్నాను నయని అంటాడు విశాల్‌. అమ్మవారి మీద భారం వేసి అమ్మగారు చెప్పినట్టు గాయత్రి పాపను తీసుకుని వెళ్తాను బాబుగారు అంటుంది నయని.

నయని గాయత్రి పాపను తీసుకెళ్తావా? అని విశాల్‌ అడగ్గానే.. నయని అవునని పాప చాలా అదృష్టవంతురాలు అని చెప్తుంది. దీంతో విశాల్‌ కూడా నేను నీవెంట వస్తాను అంటాడు. మీరెందుక బాబుగారు నేనే వెళ్లి మణిని తీసుకొస్తాను అని నయని అనడంతో నువ్వు, గాయత్రిపాప లేకపోతే నేను ఉదయం వరకు ఎలా ఉండగలను నీతో పాటే నేను ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగినా గానవిని కంటికిరెప్పలా చూసుకోవడానికి విక్రాంత్‌ ఉన్నాడు అంటాడు విశాల్‌. దీంతో మీరు అలా అనకండి బాబుగారు మనం అనుకున్నది సాధించుకుని వస్తాం అంటుంది నయని.

తమ్మి వాళ్లు ఇంత త్వరగా ఎందుకు బయల్దేరాలి అనుకున్నారు  మమ్మీ అని వల్లభ అడగ్గానే ఇంతకు ముందు వెళ్లిన దారి కాకుండా ఇప్పుడు వేరే దారిలో వెళ్లాలి కాబట్టి ఇప్పుడు త్వరగా వెళ్లాలి అనుకున్నారు అని చెప్తుంది తిలొత్తమ్మ. ఇంతలో నయని, విశాల్‌, గాయత్రి పాపను తీసుకుని వస్తారు. వాళ్లను చూసిన వల్లభ పెద్ద మరదలు చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు అంటాడు. ఒకసారి దెబ్బతింది కాబట్టి జాగ్రత్త పడుతున్నారు అని తిలొత్తమ్మ చెప్తుంది.

దీంతో భుజంగమణి దొరకగానే పని పూర్తి కాగానే మణి అక్కడే పెట్టి తిరిగి వస్తాము అని నయని చెప్పగానే వల్లభ, తిలొత్తమ్మ, సుమన షాక్‌ అవుతారు. ఇంతలో ఏది ఏమైనా ఎవరేమనుకున్నా నయని మాత్రం తిరిగి వస్తుంది అని ఇన్‌డైరెక్టుగా విశాల్‌, గాయత్రిపాప తిరిగి రారు అని అంటుంది తిలొత్తమ్మ. దీంతో నా మీద నమ్మకం ఉన్నందుకు థాంక్స్‌ అత్తయ్యా కానీ నేను వచ్చానంటే నా పక్కన కచ్చితంగా బాబుగారు, గాయత్రిపాప ఉంటారు అని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Big Stories

×