BigTV English

PM Narendra Modi: ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికా పర్యటనలో మోదీ

PM Narendra Modi: ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికా పర్యటనలో మోదీ

PM Narendra Modi said India, Land Of Opportunities: భారత్ అవకాశాల స్వర్గమని, అమెరికాలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రవాస భారతీయుల సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ రోజురోజుకు ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించారు.


అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఘనస్వాగతం లభించింది. అమెరికాలో మోదీ అభిమానులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఒక్క అమెరికానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మోదీ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని నస్సావ్ వెటరన్స్ కొలస్సియం స్టేడియం అభిమానంతో నిండిపోయింది. ఈ మేరకు ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

భారత్.. అవకాశాల గడ్డ అని, అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులను మోదీ మెచ్చుకున్నారు. అనంతరం అమెరికా, భారత్ సంబంధాలపై మాట్లాడారు. భారత్‌కు ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. వారితోనే భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలపడుతున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య వారధికి ప్రవాసుల తోడ్పాటును మరోసారి మోదీ ప్రస్తావించారు. అనంతరం ఏఐని ఉద్దేశించి ఆసక్తికర విషయం చెప్పారు. ఏఐ అంటే.. అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తొస్తుందని.. కానీ నాకు మాత్రం ఏ అంటే అమెరికా, ఐ అంటే ఇండియా అన్నారు.


Also Read: లోదుస్తుల్లో ఉండి.. కరెంట్ తీగ బాడీకి చుట్టేసుకుని.. వర్క్ ప్రెజర్ తట్టుకోలేక టెకీ ఏం చేశాడంటే?

అంతకుముందు, క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలోని డెలావేర్‌లో జరుగుతున్న క్వాడ్ శిఖారగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టుముట్టిన సమయంలో క్వాడ్ సదస్సు జరుగుతుందని, ఇలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్‌తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని ప్రధాని అన్నారు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×