BigTV English

CM Bhagwant Mann denied: ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు సీఎంకు అనుమతి నిరాకరించిన కేంద్రం

CM Bhagwant Mann denied: ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు సీఎంకు అనుమతి నిరాకరించిన కేంద్రం

CM Bhagwant Mann denied: పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లడానికి సిద్ధమైన పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌కు అనుమతి నిరాకరించింది కేంద్రం. తక్కువ సమయంలో తాము భద్రత కల్పించలేమని, ఈ విషయంలో రాజకీయ అనుమతులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో సీఎం భగవంత్ వెనక్కి తగ్గాల్సివచ్చింది.


ఐదు దశాబ్దాల తర్వాత భారత హాకీ జట్టు ఆసీస్‌పై విజయం సాధించింది. ఆగస్టు నాలుగున భారత జట్టు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత హాకీ జట్టులో పలువురు పంజాబ్ ఆటగాళ్లు ఉన్నారు. టీమ్‌కు మద్దతుగా ఆగస్టు మూడు నుంచి తొమ్మిది వరకు పారిస్‌‌లో పర్యటించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీఎం భగవంత్‌మాన్ కేంద్రాన్ని కోరారు.

తక్కువ సమయం‌లో జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించడం సాధ్యకాదని, అంతర్జాతీయ స్థాయి భద్రత కల్పించలేమని తేల్చి చెప్పింది కేంద్రప్రభుత్వం. ఇదే విషయాన్ని శుక్రవారం సాయంత్రం పంజాబ్ సీఎం కార్యాలయానికి తెలిపింది.


ALSO READ: ‘స్థానికులు టోల్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు’.. సోషల్ మీడియా వార్తల్లో నిజమెంత?

నార్మల్‌గా ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీతోపాటు దౌత్య పాస్‌పోర్టు  ఉంటుంది. సీఎం, సీనియర్ రాజకీయ నేతల విదేశీ పర్యటనకు విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తప్పనిసరి ఉండాలి. అయితే దీన్ని ఆప్ నేతలు తప్పుబడుతున్నారు. కావాలనే కేంద్రం ఇలా చేస్తుందని దుయ్యబడుతున్నా రు.

తనకు అనుమతి నిరాకరించడంపై కేంద్రంపై మండిపడ్డారు సీఎం భగవంత్ మాన్. దేశ సమాఖ్య విధానం పై బీజేపీ దాడి చేస్తోందిన ఆరోపించారు. ఇప్పుడేకాదు రెండేళ్ల కిందట సింగపూర్ వెళ్లేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అనుమతి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. కమలనాధుల రూలింగ్‌లో ప్రతి విషయానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

Tags

Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×