E-Paper
Advertisement

ఎన్డీయేను గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

ఎన్డీయేను గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

MK Stalin: త‌మిళ‌నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వంపై ఆ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ దేశంలో మళ్ళీ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రాల అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. తమిళనాడు రాష్ట్రం పేరును కూడా మార్చే ప్రమాదం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఆస‌క్తిని రేపుతున్నాయి.

తమిళనాడు సంస్కృతి, భాష, చరిత్రను దెబ్బతీయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్టాలిన్ ఆరోపించారు. “బీజేపీ అధికారంలోకి వస్తే కేవలం పరిపాలన మార్పు మాత్రమే కాదు, మన రాష్ట్రం పేరును కూడా మార్చేస్తారు. తమిళనాడును వారు కేవలం ఒక భూభాగంగా చూస్తారు తప్ప, మన భాషా ప్రాతిపదికన ఏర్పడిన అస్తిత్వాన్ని గౌరవించరు.” అని ఆయన విమర్శించారు. గతంలో గవర్నర్ తమిళగం అనే పదాన్ని ప్రస్తావించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీ మన రాష్ట్రం పేరులోని నాడు (దేశం/నేల) అనే పదాన్ని తొలగించాలని చూస్తోందని దుయ్యబట్టారు.

Advertisement

సమాఖ్య వ్యవస్థను అణిచివేసి, దేశమంతటా ఒకే దేశం, ఒకే భాష అనే ఏకపక్ష విధానాన్ని రుద్దాలని ఎన్డీయే చూస్తోందని స్టాలిన్ అన్నారు. ద్రవిడ మోడల్ పాలనను దెబ్బతీయడానికి కేంద్రం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని, నిధుల కేటాయింపులో కూడా వివక్ష చూపుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలంటే ఎన్డీయేను గద్దె దించడమే ఏకైక మార్గమని ఆయన పిలుపునిచ్చారు.

తమిళ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించే శక్తులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని స్టాలిన్ ఓటర్లను కోరారు. ఇది కేవలం అధికారం కోసం జరుగుతున్న పోరాటం కాదని, తమిళనాడు భవిష్యత్తు మరియు గుర్తింపును కాపాడుకునే యుద్ధమని ఆయన అభివర్ణించారు. “మన పేరు, మన భాష, మన హక్కులు మన దగ్గరే ఉండాలంటే ఇండియా (INDIA) కూటమిని గెలిపించండి.” అని స్టాలిన్ స్పష్టం చేశారు.

Advertisement

Read Also: మోదీ, పినరయి ఇద్దరూ ఒక్కటే.. కేర‌ళ‌లో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపు

Related News

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×