E-Paper
Advertisement

ప్రతి మలుపులోనూ ఊహించని ట్విస్టులు… అదిరిపోయే మర్డర్ ఇన్వెస్టిగేషన్

ప్రతి మలుపులోనూ ఊహించని ట్విస్టులు… అదిరిపోయే మర్డర్ ఇన్వెస్టిగేషన్
Advertisement

Crime Thriller OTT : ఇప్పుడు క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్లు రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లను ఆడియన్స్ కూడా క్రేజీగా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ గోవాలో జరిగిన కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒక రిచ్ ఫ్యామిలీలో జరిగిన మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కథలో ప్రతీ ఎపిసోడ్ లో కిల్లర్ ఎవరో అన్న ఉత్కంఠ మారుతూ ఉంటుంది. క్లైమాక్స్ లో మాత్రమే అసలు హంతకుడు ఎవరో తెలుస్తుంది. ఈ ఎండింగ్ కూడా చాలా షాకింగ్ గా ఉంటుంది.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది రైకర్ కేస్’ (The Raikar Case). బాలీవుడ్ సీనియర్ నటి అశ్విని భావే దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ సిరీస్ ద్వారా వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. ఇక అతుల్ కుల్కర్ణి నటనకు, నీల్ భూపాలం పోలీస్ ఆఫీసర్ పాత్రకు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 2020 లో వచ్చిన ఈ సిరీస్ కు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించగా, బోధి ట్రీ మల్టీమీడియా సంస్థ నిర్మించింది. ఇందులో మొత్తం 7 ఎపిసోడ్లు, ఒక్కోటి సుమారు 30 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది Jio Hotstar ప్లాట్‌ ఫామ్‌లో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

గోవాలో రైకర్ ఫ్యామిలీ అంటే మామూలు రేంజ్ కాదు, ఫుల్ క్యాష్ ఉన్నోళ్లు. అయితే ఒకరోజు ఆ ఇంట్లోని కుర్రాడు తరుణ్ సడన్‌గా చనిపోతాడు. అందరూ అది సూసైడ్ అని అనుకుంటారు కానీ, కట్ చేస్తే అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన మర్డర్ అని తెలుస్తుంది. ఆ ఊరి పోలీస్ ఆఫీసర్ జాన్ పెరీరా కేసును టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఇక అక్కడి నుండి అసలు ఆట మొదలవుతుంది. కేసు లోపలికి వెళ్లే కొద్దీ ఆ ఇంట్లో ఉన్నోళ్లందరూ తలొక వేషం వేస్తున్నారని అర్థమవుతుంది. తరుణ్ చెల్లెలు ఏతాషాకి తన సొంత ఫ్యామిలీ మనుషుల మీదనే డౌట్ వస్తుంది.

ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో సీక్రెట్ ఉంటుంది.  బయటికి బుద్ధిమంతుల్లా కనిపించే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అసలు రంగులు బయటపడతాయి. చివరికి చూస్తే, మనల్ని బాగా నమ్మించిన వాడే విలన్ లాగా కనిపిస్తాడు. రాజకీయం కోసం, పరువు కోసం ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఒకరినొకరు అనుమానించుకోవడంతో కథ మొత్తం ఫుల్ సస్పెన్స్‌గా సాగుతుంది. ప్రతీ ఎపిసోడ్ ఎండ్ లో అసలు కిల్లర్ ఎవడు? అనే ఉత్కంఠ పెంచుతూ, చివరికి ఊహించని ట్విస్ట్‌తో ఈ కథ ముగుస్తుంది.

Advertisement

Read Also : ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న 26 ఏళ్ల హాలీవుడ్ మూవీ… యాక్టింగ్ ఇరగదీసిన బ్రాడ్ పిట్… ఐయండిబిలో 8.8 రేటింగ్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×