
MK Stalin on Sanatana dharma controversy(Politics news today India) :
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. తన కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు.
సనాతన ధర్మంపై విమర్శకులకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని మోదీ తన సహచర కేంద్రమంత్రులకు సూచించారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు సీఎం స్టాలిన్ స్పందించారు. భారీ లేఖను విడుదల చేశారు. ఉదయనిధి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోకుండా ప్రధాని మోదీ కామెంట్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మహిళలను కించపరిచే సనాతన సూత్రాలపై మాత్రమే ఉదయనిధి కామెంట్ చేశారని వివరణ ఇచ్చారు. కానీ మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో అలా మాట్లాడలేదని తెలిపారు. సనాతన ధర్మం పాటింటే వారని తుదముట్టించాలని ఉదయనిధి చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ తన కుమారుడు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.
ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై సమగ్ర సమాచారాన్ని ప్రధాని మోదీ సేరించాలని సీఎం స్టాలిన్ సూచించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని తమిళనాడు సీఎం తన లేఖలో కోరారు.