Big Stories

Kharge emotional appeal: ఖర్గే ఎమోషనల్, నా అంత్యక్రియలకు రావాలి, ఏం జరిగింది?

Kharge emotional appeal: కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జునఖర్గే ఎమోషనల్ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయవద్దని అనుకున్నవారు కనీసం తన అంత్యక్రియలకైనా రావాలన్నారు. ఈసారి మీరు ఓటు మిస్సయితే మీ గుండెల్లో తనకు ఇకపై స్థానం లేదని భావిస్తానని అన్నారు.

- Advertisement -

తాను రాజకీయాల కోసమే పుట్టానని, ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రజాస్వామ్య కాపాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జునఖర్గే. తాను బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్దాంతాలను ఓడించేందుకు పుట్టానే తప్ప వారి ముందు లొంగిపోవడానికి కాదన్నారు. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ప్రసక్తిలేదన్నారు. రాజకీయ నేతలు పదవులకు దూరమైనా సిద్ధాంతాలను వదులుకోకూడదని సూచించారు.

- Advertisement -

బుధవారం కర్ణాటకలోని కలబురిగి నియోజకవర్గంలో రోడ్ షో, సభ జరిగింది. దీనికి చీఫ్ ఖర్గే, సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఆయన హాజరయ్యారు. కలబురిగి నియోజకవర్గం నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమని బరిలో ఉన్నారు. బీజేపీ ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ ఉమేశ్ జాదవ్ మరోసారి కషాయం జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ALSO READ:  ప్రచారానికి తెర.. రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

1999-2014 వరకు ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. వరుసగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో మల్లికార్జునఖర్గే విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. ఈసారి గెలుపొందాలని ఖర్గే ప్లాన్ చేశారు. ఈ క్రమంలో తన అల్లుడు రాధాకృష్ణను బరిలోకి దించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News